VIDEO: వెంబడించి, వేటాడి కారుతో గుద్ది గుద్ది చంపాడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! బెంగళూరు నడిరోడ్డుపై ఘోరం జరిగింది. ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు అస్గర్ అనే కారు డీలర్‌ను స్కార్పియోతో గుద్దించి చంపాడు అమ్రీన్. రోడ్డుపై అందరూ చూస్తుండగానే కారుతో వెంబడించి, వేటాడి చంపాడు. అస్గర్ దగ్గర నుంచి కారు కొనుగోలు చేసిన అమ్రీన్ అతనికి రూ.4లక్షల చెల్లించాల్సి ఉంది. By Trinath 01 Nov 2023 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి క్రూరత్వం మనుషుల్లో మానవత్వాన్ని మరుగున పడేస్తుంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు చూస్తుంటే భయం వేస్తోంది. సాటి మనిషిని ముక్కలు ముక్కలుగా నరికిచంపడం దగ్గర నుంచి కారుతో గుద్ది గుద్ది చంపుతున్న ఘటనలు చూస్తుంటే ఈ సమాజం ఎటు పోతుందో అర్థంకాని దుస్థితి. డబ్బుల కోసమో, వివాహేతర సంబంధాల కారణాలతోనో, కోపంతోనో అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా రోడ్డుపైనే హత్యలు చేస్తున్న రోజులివి. మనుషులను మృగాలతో పోల్చి మరో తప్పు చేస్తున్నారు. ఎందుకంటే అవి ఇలా పగలు, ప్రతీకారలతో మర్డర్లు చేయవు. బెంగళూరులో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవక మానదు! Your browser does not support the video tag. రోడ్డుపైనే ఘోరం: అది బెంగళూరు(Bengaluru) నడి రోడ్డు.. ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు.. ఇంతలోనే ఓ స్కార్పియో కారు రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఆ నడుస్తున్న వ్యక్తిని వెంబడించింది.. అతను పరిగెడుతుంటే వేటాడింది. అతను ఎటు వెళ్తే కారు అటే తిరిగింది. చివరకు గుద్దింది. గుద్దుతూనే ఉంది.. ఢీ కొట్టి కొట్టి.. అతను చనిపోయాడని తెలుసుకోని అక్కడ నుంచి పరారైంది. ఇది జరుగుతున్న సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారు. వారంతా ఈ ఘటనను చూస్తు నిలపడిపోయారు. ఏం జరుగుతుందో వారికి అర్థంకాలేదు. చాలా మంది షాక్‌లోనే ఉండిపోయారు. ఒక వ్యక్తి మాత్రం అక్కడ జరిగినదాన్ని మొత్తం వీడియో రికార్డ్ చేశాడు. అసలు ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి పేరు అస్గర్.. కారులో ఉన్న వ్యక్తి అమ్రీన్. అస్గర్ సెకండ్ హ్యాండ్ కారు డీలర్. అమ్రీన్ అతని దగ్గర కొనుగోలు చేశాడు. అయితే డబ్బులు పూర్తిగా ఇవ్వలేదు అస్గర్. అమ్రీన్‌కు అస్గర్ ఇంకా 4లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. దీని గురించి ఈ ఇద్దరి మధ్య అనేకసార్లు గొడవ జరిగింది. ఈ క్రమంలోనే డబ్బులు ఇస్తానని అస్గర్‌ను అమ్రీన్ ఓ ప్లేస్‌కు రావాలని చెప్పాడు. చెప్పినట్లుగానే అస్గర్ అక్కడికి చేరుకున్నాడు. వీరి కోసం వెయిట్ చేస్తుండగా.. స్కార్పియో కారులో వచ్చిన అమ్రీన్ అస్గర్ మీదకు కారును పొనిచ్చాడు. క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. అస్గర్ ప్రాణాలు విడిచాడు. ముందుగా యాక్సిడెంట్ కేసుగా ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అస్గర్ ఫ్రెండ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు నిజం బయటపడింది. వీడియో కూడా దొరకడంతో అమ్రీన్‌తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read: ఇద్దరు ప్రియులు.. బలైన మొగుడు.. భర్తను చంపి భలే స్టోరీ అల్లిందిగా! #bengaluru మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి