Hardik-Natasha : విడాకులకు సిద్ధమైన హార్డిక్ పాండ్యా-నటాషా.. ఆ ఫొటోలన్నీ డిలిట్!

క్రికెటర్ హార్డిక్ పాండ్యా, నటి నటాషా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టా ఖాతాలో పాండ్యా పేరును నటాషా డిలిట్ చేయడంతో వార్తలు ఊపందుకున్నాయి. నటాషా బర్త్ డేకు పాండ్యా విష్ చేయకపోవడం, ఆమె ఐపీఎల్ మ్యాచ్ లకు రాకపోవడంతో మరింత బలం చేకూరింది.

New Update
Hardik-Natasha : విడాకులకు సిద్ధమైన హార్డిక్ పాండ్యా-నటాషా.. ఆ ఫొటోలన్నీ డిలిట్!

Divorce : భారత క్రికెటర్ హార్డిక్ పాండ్యా (Hardik Pandya) నటి నటాషా (Natasha Stankovic) దంపతులకు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రేమించి పెళ్లాడిన హార్డిక్-నటాషా దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నటాషా తన ఇన్‌స్టా ఖాతాలో పాండ్యాతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించిందని, డివోర్స్ (Divorce) కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేకు నటాషా.. ఇన్‌స్టా యూజర్‌నేమ్‌లో పాండ్యా అనే పదాన్ని డిలిట్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు సోషల్‌ మీడియా (Social Media) లో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ ఈ మధ్య కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకోలేదు. ఫిబ్రవరిలో లవర్స్ డే రోజు పాండ్య పోస్ట్‌ చేసిన ఫొటోనే చివరిది. కాగా ఐపీఎల్‌ టోర్నీ సమయంలోనూ నటాషా స్టాండ్స్‌లో కనిపించకపోవడంతో మరింత బలం చేకూరింది. అలాగే మార్చి 4న నటాషా బర్త్ డే రోజు పాండ్య విష్‌ చేయలేదు. ఈ క్రమంలో ఇరువురి ఫాలోవర్స్ వీరిద్దరూ విడిపోతున్నారంటూ కామెంట్స్ చేస్తు్న్నారు. కానీ ఇప్పటివరకూ పాండ్యా, నటాషాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉంటే.. 2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న జోడి.. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అదే సంవత్సరం జులైలో నటాషా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్‌ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు.

Also Read : రేపే ఫైనల్స్.. ట్రోఫీతో ఫోజులిచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో  షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని  రిలీజ్ చేయగలమా? లేదా అనే  టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు  ఫ్యాన్స్ కూడా  తీవ్ర నిరాశ చెందుతున్నారు.  ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు.  మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు  ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్. 

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment