టీమిండియా ఫ్యాన్స్‌కు అలెర్ట్.. వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌ తేదీల్లో మార్పులు!

ప్రపంచ కప్‌లో ఇండియా ఆడే రెండు మ్యాచ్‌ల తేదీలు మారాయి. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ అక్టోబర్‌ 15 నుంచి 14కు రీషెడ్యూల్‌ అవ్వగా.. భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్‌ నవంబర్‌ 11 నుంచి 12కు మారింది. మరోవైపు ఆసియా కప్‌లో పాల్గొనే భారత్ జట్టు జెర్సీపై 'పాకిస్థాన్‌' అని రాసి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

New Update
టీమిండియా ఫ్యాన్స్‌కు అలెర్ట్.. వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌ తేదీల్లో మార్పులు!

క్రికెట్‌ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ కప్‌కి సమయం దగ్గర పడుతోంది. ఇదే సమయంలో షెడ్యూల్‌ మార్పుపై గందరగోళం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌పై కొన్ని దేశాల క్రికెట్‌ బోర్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. బీసీసీఐ మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా షెడ్యూల్‌లో రెండు మ్యాచ్‌ల తేదీలను మార్చారు. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను అక్టోబర్ 15 నుంచి 14కు ఛేంజ్‌ చేశారు. ఇక భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ను నవంబర్ 11 నుంచి 12కు మార్చారు. అటు పాకిస్థాన్‌ మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చారు.


భారత్‌, పాక్‌ రీషెడ్యూల్ మ్యాచ్‌లు:

• భారత్ వర్సెస్ పాకిస్థాన్ - అక్టోబర్ 15 మ్యాచ్‌ని 14కు మార్చారు.

• పాకిస్తాన్ వర్సెస్‌ శ్రీలంక - అక్టోబర్ 12 జరగాల్సిన మ్యాచ్‌ని 10కు మార్చారు.

• ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ - నవంబర్ 12 మ్యాచ్‌ని 11కు ఛేంజ్‌ చేశారు.

• భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ - నవంబర్ 11 మ్యాచ్‌ని 12కు మార్చారు.

ఇండియా-పాక్‌ మ్యాచ్‌లో మార్పులు కారణంగా మిగిలిన మ్యాచ్‌ల తేదీల్లోనూ మార్పులు రానున్నాయి. అటు పాక్‌ మ్యాచ్‌ల తేదీలు, వేదికపై పీసీబీ అసంతృప్తిగా ఉంది. మరోవైపు ఇండియా, పాక్ మ్యాచ్‌ కోసం ఇప్పటికే హోటల్‌ రూమ్స్ భారీ ధరలకు బుక్ అయ్యాయి.

జెర్సీ మార్పు:
ఇక త్వరలోనే ప్రారంభంకానున్న ఆసియా కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అయితే భారత జట్టు తమ జెర్సీపై ‘పాకిస్థాన్’ అని రాసే అవకాశముందన్న వార్త వైరల్‌గా మారింది. పాకిస్థాన్ అనే పేరు రాసి ఉన్న జెర్సీని ధరించిన భారత క్రికెట్ స్టార్స్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆసియా కప్‌ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఆగస్టు 30న ముల్తాన్‌లో పాక్‌- నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నీ ప్రారంభం అవుతుంది. 'గ్రూప్ ఏ'లో ఇండియా, పాక్‌తో పాటు ఆసియా కప్ టోర్నీకి తొలిసారిగా అర్హత సాధించిన నేపాల్ పోటీపడుతోంది. 'గ్రూప్ బీ'లో శ్రీలంక, అఫ్థానిస్తాన్, బంగ్లాదేశ్ పోటీ పడనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు