world cup 2023:చూసినోళ్ళకు చూసినంత...క్రికెట్ పండగ మొదలవుతోంది. వన్డే వరల్డ్ కప్ కు అంతా సిద్ధమయింది. ఈరోజే క్రికెట్ పండగకు మొదటిరోజు. భారత్‌లో జరిగే ప్రపంచ సమరం ముంగిట్లోకి వచ్చేసింది. క్రికెట్ ఫ్యాన్స్ కు దాదాపు నెలన్నర రోజులు పండగే పండగ. పసందైన షాట్లు.. అదిరిపోయే సిక్స్ లు, బౌండరీ లైన్ దాటే బంతులు, అద్భుతమైన క్యాచ్ లు, క్లీన్ బౌల్డ్, డకౌట్ లు, సెంచరీలు...ఓహ్..ఇలా ఒకటేమిటి చూసినోళ్లకు చూసినంత, ఎంజాయ్ చేసేవాళ్ళకు కావల్సినంత సంబరం. By Manogna alamuru 05 Oct 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి World Cup 2023: క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న విశ్వసమరానికి భారత్ సిద్ధమైంది. క్రికెట్ సునామీలో ముంచేందుకు అన్ని టీమ్‌లూ రెడీ అయ్యాయి. మొదటిసారి ఒంటరిగా అతిధ్యమిస్తున్న భారత్ మెగాటోర్నీకి సర్వం సిద్ధం చేసింది. నేడు అహ్మదాబాద్ లో సమరానికి తెర లేవనుంది. 12 ఏళ్ళ తర్వాత క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఇండియా(India)లో జరుగుతోంది. అక్టోబరు 5వ తేదీ నుంచి నవంబరు 19వ తేదీ వరకూ మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది మేటి జట్లు ఈ వరల్డ్ కప్ లో పాల్గొననున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ మ్యాచ్ లు మొత్తం ఇండియాలోనే జరగనున్నాయి. భారత్ ఆతిథ్యదేశంగా ఈ ప్రపంచ్ కప్ ను నిర్వహిస్తుంది. ఇది 13వ ప్రపంచకప్ (13th World Cup). నాలుగేళ్లకు ఒకసారి ఈ వరల్డ్ కప్ జరుగుతుంది. 2019లో వరల్డ్ కప్ జరిగింది. క్రికెట్‌ను మతంగా భావించే మన దేశంలో వన్డే వరల్డ్‌కప్ జరుగుతుండటంతో.. భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 10 జట్లు.. 10 వేదికలు.. 45 రోజులు.. 48 మ్యాచ్‌లు.. 6 డబుల్ హెడర్స్‌తో ప్రపంచకప్ వేడిని పుట్టిస్తోంది.పసలేని మ్యాచ్‌లకు, బోరింగ్ సమరాలకు స్వస్తి పలుకుతూ..ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో ఉన్న ఎనిమిది జట్లను మెగాటోర్నీకి నేరుగా ఎంపిక చేయగా.. శ్రీలంక, నెదర్లాండ్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటి ముందంజ వేశాయి. భారత్‌తో పాటు, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ప్రపంచకప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇందులో ఇంతకు ముందు ఐదు జట్లు...ఆస్ట్రేలియా 5 సార్లు, భారత్ రెండుసార్లు, ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి ట్రోఫీని దక్కించుకున్నాయి. మిగిలిన ఐదు జట్లు ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్ హోదా దక్కించుకోలేకపోయాయి. మెగాటోర్నీకి ముందు ఆరంభ వేడుకలు నిర్వహించకూడదని ఐసీసీ నిర్ణయించుకుంది. అందుకే బుధవారమే వరల్డ్‌కప్ సారథులతో ‘కెప్టెన్స్ మీట్’ జరిగింది. ఏఏ మ్యాచ్‌లు ఎక్కడ నుంచి... అక్టోబరు 5 నుంచి అంటే ఈరోజు నుంచే వరల్డ్ కప్ టోర్నమెంటు మొదలవుతోంది. ఫైనల్ మ్యాచ్ నవంబరు 19న జరగబోతోంది. మొదలు, తుది రెండు మ్యాచ్‌లకూ కూడా గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.ఈ టోర్నమెంటుకు ఆతిథ్యమిస్తున్న భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబరు 8న చెన్నై వేదికగా జరగుతుంది.మొత్తంగా 46 రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం పది నగరాల్లోని స్టేడియంలను ఎంపికచేశారు. అవి తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాకట, పశ్చిమ బెంగాల్‌లలో ఉన్నాయి. Also Read: ఒకడు తోపు..ఇంకోడు తురుము.. ది గ్రేట్ ఖలీ, రోహిత్ శర్మ ఫొటో వైరల్..! హైదరాబాద్ - రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అహ్మదాబాద్ – నరేంద్ర మోదీ స్టేడియం ధర్మశాల – హెచ్‌పీసీఏ స్టేడియం ఢిల్లీ – అరుణ్ జైట్లీ స్టేడియం చెన్నై – ఎంఏ చిదంబరం స్టేడియం లఖ్‌నవూ – బీఆర్ఎస్ఏబీవీ క్రికెట్ స్టేడియం పుణె – ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం బెంగళూరు – ఎం చిన్నస్వామి స్టేడియం ముంబయి – వాంఖడే స్టేడియం కోల్‌కతా – ఈడెన్ గార్డెన్స్ వరల్డ్‌కప్ ఆడే భారత టీమ్... ఈ టోర్నమెంట్ కోసం 15 మంది ప్లేయర్లతో జట్టును ఎంపిక చేశారు. దీనికి రోహత్ శర్మ కెప్టెన్‌కాగా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకుర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్‌లు ఈ జట్టులో ఉన్నారు. ఎక్కడ చూడొచ్చు... భారత్‌లోని స్టార్ స్పోర్ట్స్ (Star Sports) నెట్‌వర్క్ టీవీ చానెల్స్‌లో ఈ మ్యాచ్‌లు చూడొచ్చు. డీడీ స్పోర్ట్స్, డీడీ నేషనల్‌లోనూ ఈ మ్యాచ్‌లు వస్తాయి. ఇక ఆన్‌లైన్ విషయానికి వస్తే ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ (Hotstar)లో ఈ మ్యాచ్‌లను లైవ్ చూడొచ్చు. అంతేకాదు తమ మొబైల్ యాప్‌లో ఉచితంగానే ఈ మ్యాచ్‌లను చూడొచ్చని ఇప్పటికే హాట్‌స్టార్ ప్రకటించింది. మొదటి మ్యాచ్... వరల్డ్‌కప్ 2023లో మొదటి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై బౌండ్రీల లెక్క ఆధారంగా విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్.. ఈ సారి తొలి మ్యాచ్‌లో కివీస్‌నే ఎదుర్కోనుంది. ఇరు జట్ల మధ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు వన్డేలు మాత్రమే జరగగా.. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ బలంగా కోరుకుంటున్నది. అయితే ఇరు జట్లను గాయాల బెడద వెంటాడుతున్నది. స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి వరల్డ్‌కప్.. ఇండియాతో పాటూ పలు దేశాల్లో క్రికెట్ దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్ కానుంది. వీరిలో భారత కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, ఆసీసీ నుంచి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్న్, ఇంగ్లండ్ నుంచి జో రూట్, జోస్ బట్లర్.. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ.. దక్షిణాఫ్రికా నుంచి డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్.. బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్‌లు ఉన్నారు. వీళ్ళు నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చే వరల్డ్‌కప్‌లో ఆడడం కష్టమే. అందుకే ఈసారి తమ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడాలని వీళ్ళంతా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. Also Read: ఢిల్లీ కోర్టులో శిఖర్ ధావన్‌కు భారీ ఊరట.. అయేషా ముఖర్జీతో విడాకుల కేసు! #cricket #india #sports #today #oneday #world-cup-2023-schedule #worldcup2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి