అధికార పార్టీ అండతో 'ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్' రెచ్చిపోతుంది.. క్రికెట్‌ అభిమానులు ఫైర్..

విశాఖలో ఈనెల 23 న ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగే టీ20 సిరీస్‌ టికెట్ల కోసం గంటల కొద్ది లైన్లో నిల్చున్నా టికెట్లు దక్కలేవని అభిమానులు వాపోయారు. టికెట్ల విషయంలో ప్రైవేట్‌ వ్యక్తులు తిష్ఠ వేశారని అధికార పార్టీ అండతో 'ఏసీఏ' ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

New Update
అధికార పార్టీ అండతో 'ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్' రెచ్చిపోతుంది.. క్రికెట్‌ అభిమానులు ఫైర్..

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం రోజు జరగనున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మ్యాచ్ తర్వాత ఈ నెల 23న భారత్-ఆస్ట్రేలియాల మధ్య టీ20 సిరీస్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జరగబోతోంది. మొదటి టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం ఆన్ లైన్ లో ఎప్పుడో మొదలైపోయింది. అక్కడ అయిపోయాక ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లు అమ్మతున్నారు. ఈ టికెట్ల కోసం విశాఖ యూత్ కౌంటర్ల దగ్గర బారులు తీరారు. మధురవాడలోని క్రికెట్‌ స్టేడియంతో పాటు మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని ఇండోర్‌ స్టేడియంలో టికెట్లను అమ్ముతున్నారు. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియోషన్ (ACA) మాత్రం సామన్యుల నడ్డి విరిచే విధంగా అధికంగా టికెట్‌ రేట్లు పెంచేసింది. రూ.600, 1,500, 2,000, 3,000, 5,000 ధరల్లో టికెట్లను అందుబాటులో ఉంచారు.

Also read: దేవుడి వల్ల కూడా కాలేదు.. రోహిత్‌ సాధిస్తాడా? హిట్‌మ్యాన్‌ని ఊరిస్తోన్న మరో రికార్డు!

గంటల తరబడి క్యూలో నిల్చున్న కూడా టికెట్స్ దక్కడం లేదని క్రికెట్‌ అభిమానులు వాపోతున్నారు. అధికార పార్టీ అండదండలతో 'ఏసీఏ' కార్యవర్గం ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తోందని విమర్శిస్తున్నారు. విచ్చలవిడిగా ప్రైవేట్‌ వ్యక్తులు తిష్ట వేశారని.. టికెట్లు మాయం చేశారని.. పోలీసుల కన్నా బౌన్సర్లే స్టేడియంలో అధికంగా ఉన్నారని చెబుతున్నారు. రాజకీయ నేతల చొరవతో పోలీసులు కూడా గప్‌చుప్‌గా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read: ‘అమితాబ్‌ ఇంటికి తాళాలు..’ టీమిండియా ఫ్యాన్స్‌ దెబ్బకు షాక్‌లో బిగ్‌ బి!

Advertisment
Advertisment
తాజా కథనాలు