India-Canada Row : నిజ్జర్ హత్య కేసుపై మళ్లీ నోరు పారేసుకున్న కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తముందనే ఆరోపణలు కొట్టిపారేయాలేమని.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి నోరుపారేసుకున్నారు. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉందన్నారు. By B Aravind 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Nijjar - Justin Trudeau : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య(Suicide) వెనుక భారత ఏజెండ్ల హస్తముందని కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో(Justin Trudeau) గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కేసు దర్యాప్తుపై తాజాగా స్పందిన ట్రూడో మళ్లీ భారత్‌పై నోరుపారేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని.. కానీ ఈ కేసులో భారత ప్రభుత్వ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. Also Read : 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగింపు.. ఎక్కడంటే తేలిగ్గా తీసుకోలేం కెనడా(Canada) కు చెందిన ఓ మీడియా ఛానల్ కార్యక్రమంలో జస్టీన్ ట్రూడో పాల్గొన్నారు. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ' కెనడలో మన పౌరుడిపై హత్య జరిగింది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని విశ్వసనీయ ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని మేను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. విదేశీ ప్రభుత్వాల చట్టవిరుద్ధమైన చర్యల నుంచి కెనడా పౌరులను రక్షించే బాధ్యత మాపై ఉంది. ఇందుకోసమే ఈ అంశాన్ని మేము సీరియస్‌గా తీసుకున్నామంటూ' ట్రూడో వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న దౌత్యవివాదం ఇదిలా ఉండగా.. గత ఏడాది జూన్ ఖలిస్థానీ ఉగ్రవాది(Terrorist) నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని.. ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది. ఆయన చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్ కెనడాకు చాలాసార్లు చెప్పింది. అయితే తాజాగా ట్రూడో మళ్లీ ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read : గూగుల్‌లో 1.2 ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్ #telugu-news #canada #hardeep-singh-nijjar #justin-trudeau #india-canada-issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి