Tammineni Veerabhadram: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు TG: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ అభ్యర్థులు బరిలో నుంచి విరమించుకోవాలని సీఎం కోరారని.. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. By V.J Reddy 27 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Tammineni Veerabhadram: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ అభ్యర్థులు బరిలో నుంచి విరమించుకోవాలని సీఎం కోరారని.. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈరోజు సీపీఎం నేతలతో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. చర్చలు అనంతరం సీపీఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ALSO READ: ఏపీలో గెలిచేది ఆ పార్టే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కారు, కమలం పార్టీలకు కామ్రేడ్లు షాక్... కాంగ్రెస్ పార్టీకి సీపీఎం మద్దతు ప్రకటించడం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. సీపీఎం ఒంటరిగా పోటీ చేసే స్థానాల్లో ఓట్లు చీలి కాంగ్రెస్ దెబ్బ తీస్తుందని భావించిన రెండు పార్టీల ఆశ నిరాశే అయింది. తమ అభ్యర్థులను పోటీ నుంచి తప్పిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. కాగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో సీపీఐ, సీపీఎం బలంగా ఉంది. ఇప్పటికే సీపీఐ తమ మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు నో.. ఇప్పుడు ఒకే.. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ తో పొత్తుకు నో అన్న సీపీఎం.. ఇప్పుడు మీకు మేము ఉన్నాము అంటూ వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి సొంతంగా పదికి పైగా స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపి డిపాజిట్ కూడా తెచ్చుకోలేక పోయింది. అన్ని స్థానాల్లో సీపీఎం అభ్యర్థులు ఓటమి చెందారు. అయితే.. తాము అడిగిన స్థానాలకు కాంగ్రెస్ నిరాకరించడంతో సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. మరో వైపు సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఒక అసెంబ్లీ స్థానంలో గెలిచి.. అసెంబ్లీ లోకి ఎర్రజెండాను మోసుకుపోయింది. ఆనాడు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీపీఎం తాజాగా తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని తేల్చి చెప్పింది. #congress #cm-revanth-reddy #cpm #tammineni-veerabhadram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి