CPI : 'ఏపీలోని ఎంపిలు పనికిమాలిన వెధవలు.. భయంతో బతుకుతున్నారు' పార్లమెంట్‌లో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విజయవాడలో INDIA కూటమి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీపై సీపీఐ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఏపీలోని ఎంపిలు పనికిమాలిన వెధవలు.. భయంతో బతుకుతున్నారంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 22 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada : పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ విజయవాడ(Vijayawada) లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్ష, ఆప్ పార్టీ ల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ(CPI Ramakrishna) మాట్లాడుతూ.. ఎంపీల సస్పెషన్ పై మోడీ కి వ్యతిరేకంగా దేశం మొత్తం ఇండియా కూటమి నిరసనలు చేపట్టిందని తెలిపారు. దేశంలో అప్రజాస్వామ్య పాలనతో మోడీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు లో జరిగిన దాడి గురించి మాట్లాడకూడదా? దాడిపై వివరణ కోరిన 146 మంది ఎంపిలను సస్పెండ్ చేయడం దుర్మార్గం అన్నారు. సమాధానం చెప్పలేకే విపక్ష ఎంపిలను బయటకి పంపుతారా? అని ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై ఏపీ లో ప్రధాన పార్టీ నేతలు నోరు ఎందుకు మెదపరు? అని ప్రశ్నించారు. ఏపీలోని ఎంపి లు పనికిమాలిన వెధవలు.. భయంతో బతుకుతున్నారు అని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఎంపిలకు బుద్ధి చెప్పండని ఫైర్ అయ్యారు. Also Read: రేపే వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్..పవన్, చంద్రబాబు, లోకేష్‌కు ఆర్జీవీ ఆహ్వానం.! సిపిఎం శ్రీనివాసరావు(CPM Srinivasa Rao) మాట్లడుతూ.. దేశంలో ఉగ్రవాద పార్టీ బిజెపి(BJP) అని సంచలన కామోంట్స్ చేశారు. పార్లమెంటు లో దాడి జరిగితే అడగకూడదా? అని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా లు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వైసిపి, టిడిపి లు మోడీ ముందు మోకరిల్లుతున్నారని..సిగ్గుంటే మోడీ విధానాలను టిడిపి, వైసిపి లు నిలదీయాలని సవాల్ విసిరారు. కేంద్రం లో బిజెపి, రాష్ట్రం లో వైసిపి కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఏఐసిసి(AICC) సభ్యులు నరసింహారావు మాట్లాడుతూ.. పార్లమెంటు కు రక్షణ కల్పించలేని మోడీ(Modi), అమిత్ షా(Amit Shah) లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైఫల్యాలు ను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అని మండిపడ్డారు. విపక్ష ఎంపిల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీ చేతకాని పాలన వల్ల పార్లమెంటు కు రక్షణ లేకుండా పోయిందని దుషించారు. పార్లమెంటు లో దాడిని అందరూ ఖండించాలని కోరారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో కేంద్రం ప్రకటించాలన్నారు. మోడీ, అమిత్ షాల అరాచకాలు పెరిగి పోతున్నాయని..కార్పరేట్ శక్తుల కు దోచి పెట్టడమే మోడీ విధానం అని ఆరోపించారు. పార్లమెంటు కు రక్షణ కల్పించలేని వారు దేశాన్ని ఏం కాపాడతారు? అని ప్రశ్నించారు. మీ వైఫల్యాలను ప్రశ్నిస్తే సస్పెండ్ ద్వారా నోరు మూయిస్తారా? అంటూ మండిపడ్డారు. #andhra-pradesh #vijayawada #parliament #cpi-ramakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి