Hyderabad : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి సంచలన నిర్ణయం..ఒకేసారి 86 మంది పోలీసులు బదిలీ

హైదరాబాద్‌ సీపీ కొత్తపేట శ్రీనివాస్‌ రెడ్డి.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటికి రావడం, మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలతోనే వీళ్లందర్ని బదిలీ చేశారు.

New Update
Hyderabad : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి సంచలన నిర్ణయం..ఒకేసారి 86 మంది పోలీసులు బదిలీ

Hyderabad CP : హైదరాబాద్‌(Hyderabad) సీపీ కొత్తపేట(Kothapeta) శ్రీనివాస్‌ రెడ్డి(Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌(Punjagutta Police Station) లో సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. ఏకంగా 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఏఆర్‌కు అటాచ్‌ చేశారు. అయితే ఇలా 86 మందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి.

Also Read: మరో వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు విడుదల

బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటికి రావడంపై సీపీ శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారనే ఆరోపణలతోనే వీళ్లందర్ని బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి పంజాగుట్ట స్టేషన్‌కు కొత్త సిబ్బందిని నియమించనున్నారు.

Also Read: ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్‌ను కాలితో తన్నిన వైనం

Advertisment
Advertisment
తాజా కథనాలు