Punjab: డేరా బాబా నిర్దోషి.. ఆ హత్యకేసులో హైకోర్టు సంచలన తీర్పు! రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట లభించింది. డేరా బాబాతో పాటు మరో నలుగురిని పంజాబ్-హర్యానా హైకోర్టు మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. డేరా బాబా అనుచరుడు రంజిత్ సింగ్ 2002 జూలై 10న హత్యకు గురయ్యారు. By srinivas 28 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Ranjit Singh Murder Case: రంజిత్ సింగ్ హత్యకేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మింత్ రామ్ రహీమ్ సింగ్ (డెరా బాబా)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో డేరా బాబాతో పాటు మరో నలుగురిని పంజాబ్-హర్యానా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ సురేష్ వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన బెంచ్ డేరా బాబా అప్పీల్ పై ఈ తీర్పు వెల్లడించింది. అత్యాచారం కేసు, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో డేరాబాబాను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ కోర్టు గతంలో తీర్పు ఇచ్చిన సంగతి తెలసిందే. కాగా దీనిని సవాల్ చేస్తూ డేరాబాబా హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రంజిత్ సింగ్ హత్యకేసులో డేరాబాబాను న్యాయస్థానం నిర్దోషిగా పేర్కొంది. జర్నలిస్టు ఛత్రపతి హత్య కేసులో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించలేదు. ఇది కూడా చదవండి: Rishabh Pant: ఆ రోజే చచ్చిపోతాననుకున్నా.. ఏడు నెలలు నరకం చూశా! డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష.. ప్రస్తుతం డేరాబాబా రోహ్ తక్ లోని సునారియా జైళ్లో ఉంటున్నాడు. అయితే 2002లో డేరా బాబా అనుచరుడైన రంజిత్ సింగ్ హత్యకు గురయ్యారు. ఆయన ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను పేర్కొంటూ రాసిన ఓ లేఖ అప్పట్లో దుమారం రేపింది. అది ఆశ్రమ మేనేజర్ రంజిత్ సింగ్ రాసినట్లు డేరా బాబా సందేహించారు. దీంతో రంజిత్ ను హత్య చేసినందుకు డేరాబాబా కుట్రపన్నినట్లు సీబీఐ పేర్కొంది. ఇద్దరు సాధ్వీలను రేప్ చేసినట్లు రుజువుకాడంతో డేరాబాబా 2017లో జైలుకు వెళ్లాడు. ఆ కేసులో సీబీఐ ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. తాజాగా హత్య కేసులో ఊరట లభించింది. #murder-case #dera-baba #ranjit-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి