China : కుక్క తోక వంకరే.. చైనా బుద్ది వంకరే!

New Update
China : కుక్క తోక వంకరే.. చైనా బుద్ది వంకరే!

China : గోతికాడ గుంట నక్కలు ఎలా ఉంటాయో తెలుసా? విషం చిమ్మే పాములు ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూశారా? పెద్దగా ఆలోచించకండి.. మన పక్కనే ఉంటాయ్.. అవేనండి.. పాకిస్థాన్‌(Pakistan), చైనా(China) లు.. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయ్ కదా.. ఏదో ఒకటి చేసి మన ఇజ్జత్‌ తియ్యాలని పనిగట్టుకోని ఉన్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది.

ఇటివలీ ఇండియా(India) గురించి బ్రిటన్‌ పత్రిక 'ది గార్డియన్‌' సంచలన కథనాన్ని ప్రచురించింది. విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యచేస్తున్నదన్నది ఈ కథంన సారాంశం. 2020 నుంచి పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించారని వివరించింది. గార్డియన్ తన నివేదికలో ఇరు దేశాల ఇంటెలిజెన్స్ అధికారులతో ఇంటర్వ్యూలు, పాకిస్థానీ పరిశోధకులు పంచుకున్న పత్రాలను ప్రస్తావించింది. దాదాపు 20 హత్యలకు భారతదేశానికి అనధికారికంగా సంబంధం ఉందని 'ది గార్డియన్‌'(The Guardian) ప్రచురించింది. ఈ మరణలతో RAW ప్రత్యక్ష ప్రమేయం ఉందని కొన్ని డాక్యుమెంట్స్‌ను ప్రూఫ్‌గా చూపించింది.

ది గార్డియన్‌' కథనంపై ఓవైపు చర్చ జరుగుతుండగానే చైనాకు సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. భారత్‌లో మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్‌ గ్రూప్‌లు గురిపెట్టాయన్న వార్త చక్కర్లు కొట్టింది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్‌' నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావలన్నది చైనా ఎత్తుగడగా తెలుస్తోంది. ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కృత్రిమ మేధ-ఏఐతో యాంకర్లను, మీమ్స్, ఆడియోలు, వీడియోలను సృష్టించి, సోషల్‌ మీడియాలో పోస్టు చేసే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ చెబుతోంది. కొన్ని నెలల క్రితం జరిగిన తైవాన్‌ పార్లమెంట్‌ ఎన్నిక(Parliament Elections) ల్లో చైనా సైబర్‌ గ్రూప్‌లు క్రియాశీలకంగా పని చేశాయన్న విషయాన్ని మైక్రోసాఫ్ట్ నొక్కి చెప్పింది.

ఇలా ఎన్నికల సమీపిస్తోన్న వేళ పాక్‌ నక్క జిత్తులు, చైనా తన వక్ర బుద్ధిని బయటపెట్టుకుంటోంది. ఎన్నికల సమయంలో భారత్‌పై విష ప్రచారం చేయడం ఈ రెండు దేశాలకు కొత్తేమీ కాదు. ది గార్డియన్‌ కథనమంతా తప్పుల తడకగా ఉందని భారత్‌ వాదిస్తోంది. అసలు ఆ హత్యలు చేస్తుంది పాకిస్తానేనని అంటోంది. అయినా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్‌ నుంచి ఇలాంటి నీతి కథలు వినడం విడ్డూరంగా అనిపిస్తోంది. అటు చైనా సంగతి సరేసరి. ఆ దేశానికి ఉన్న భూకాంక్ష ఈ భూమండలంపై ఎవరికి లేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అనేక భూభాగాలాను తమవేనని క్లైయిమ్ చేస్తున్న చైనా భారత్‌లోని ఎన్నికల సమయంలో మరోసారి కుట్రలకు పాల్పడుతోంది. ఎంతైనా కుక్క తోక వంకరే కదా!

Also read: రోడ్డు లేని కారణంగా దగ్గరకు రాని అంబులెన్స్‌.. మార్గమధ్యలోనే గర్భిణీ ప్రసవం!

Advertisment
Advertisment
తాజా కథనాలు