Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం.. తరిమి కొట్టండి ఇలా.. గర్భిణీలలో మలబద్ధకం వచ్చే అవకాశాలుంటాయి. అటువంటి పరిస్థితిలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, నారింజ, అరటి - యాపిల్ వంటి పండ్లను తినడం చేయాలి. అలానే డాక్టర్ ఇచ్చే మందులను కూడా సమయానికి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ఆరోగ్య నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. By KVD Varma 07 Jan 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Pregnancy - Constipation : గర్భం అనేది మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన దశ. తొమ్మిది నెలల పాటు కడుపులో శిశువును కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఈ సమయంలో మహిళలు(Woman's) అనేక శారీరక మార్పులకు లోనవుతారు. గర్భధారణ సమయంలో, మహిళలు తమను తాము అలాగే కడుపులో బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో మలబద్ధకం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో, వారు తమ ఆహారపు అలవాట్లపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అయితే గర్భధారణ(Pregnancy) సమయంలో మహిళలు మలబద్ధకం(Constipation) తో ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం. కొన్నిసార్లు ఈ మలబద్ధకం సమస్య సాధారణం కావచ్చు. కానీ మీరు మలబద్ధకం కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే, దానిని నయం చేసే చర్యల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్య గురించి ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయాలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మలబద్దకానికి కారణం ఏమిటి? ప్రముఖ గైనకాలజిస్టులు(Gynecologists) చెబుతున్న దాని ప్రకారం.. గర్భధారణ సమయంలో మలబద్దకానికి సంబంధించిన సమస్యలు చాలా తరచుగా కనిపిస్తాయి. నిజానికి ఈ కాలంలో స్త్రీల శరీరంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ పెరగడం వల్ల శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇందులో, వారి శరీరంలోని ఇతర భాగాలతో పాటు, వారి ప్రేగులకు కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో, ప్రేగులు నెమ్మదిగా పని చేస్తాయి. దీని కారణంగా జీర్ణక్రియ ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. అందదువల్ల మలబద్ధకం సంభవించే అవకాశం ఉంటుంది. Also Read: చిన్నారులకు చెవిపోటు వస్తే ఏం జరుగుతుంది? మలబద్ధకం ఉంటే ఏమి చేయాలి? దీని గురించి గర్భిణులు(Pregnancy) ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ అంటున్నారు. మీరు మీ ఆహారంలో ఫైబర్(Fiber) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాలి. నారింజ, అరటి - యాపిల్ వంటి పండ్లను మీ ఆహారంలో వీలైనంత ఎక్కువగా చేర్చుకోండి. ఇది కాకుండా, మీ ఆహారంలో క్యారెట్, ముల్లంగి, దోసకాయ, టర్నిప్.. ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. బంగాళదుంపలు- గంజి కూడా తినడానికి ప్రయత్నించవచ్చు. అంతే కాకుండా డాక్టర్ ఇచ్చే మందులను కూడా సమయానికి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ఆరోగ్య నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. గమనిక: ఈ ఆర్టికల్ పాఠకుల ప్రాధమిక అవగాహన కోసం ఇచ్చినది మాత్రమే. ఇందులోని అంశాలు ఆయా సందర్భాలలో వైద్యులు ఇచ్చిన సూచనల ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే, వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నాం. Watch this interesting Video : #pregnant #constipation #gynecologists మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి