YS Rajashekar Reddy: వైఎస్‌ మాకే సొంతం.. కాంగ్రెస్ VS వైసీపీ

ఏపీ రాజకీయాల్లో అటు కాంగ్రెస్‌ ఇటు వైసీపీ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఓన్‌ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జగన్, షర్మిల ఇద్దరూ వేరువేరుగా ఘాట్‌ వద్ద నివాళులర్పించడం టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది. మరిన్ని వివరాలకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update
YS Rajashekar Reddy: వైఎస్‌ మాకే సొంతం.. కాంగ్రెస్ VS వైసీపీ

అటు జగన్‌.. ఇటు షర్మిల.. మధ్యలో వైఎస్‌ఆర్‌..! ఇది ఏపీ రాజకీయాల్లో అటు కాంగ్రెస్‌ ఇటు వైసీపీ మధ్య కనిపిస్తున్న సీన్‌. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని ఓన్‌ చేసుకోవడానికి ఆయన కుమారుడు జగన్‌, ఆయన కూతురు షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ తమ పార్టీకి చెందిన నేతేనని కాంగ్రెస్‌ బలంగా గుర్తుచేస్తోంది. మరోవైపు తండ్రి అడుగుజాడల్లో నడిచేది జగనేనని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా అన్నాచెల్లెలు ఇద్దరూ వేరువేరుగా ఘాట్‌ వద్ద నివాళులర్పించడం టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది.

Also Read: కాంగ్రెస్‌లో అలాంటి సీఎం వైఎస్ ఒక్కరే.. : ఉండవల్లి అరుణ్

'వైఎస్ఆర్ నాకు స్ఫూర్తి.. ఆయన బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మ‌రోలా ఉండేది..' ఇది వైఎస్‌ జన్మ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్‌ గురించి రాహుల్‌ గాంధీ ఓ పెద్ద వీడియో రిలీజ్ చేశారు. తన జోడోయాత్రకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు చేసిన పాదయాత్రే స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ వారసత్వాన్ని పీసీసీ చీఫ్ షర్మిల సమర్ధవంతంగా ముందుకు తీసుకు వెళ్తుందని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, న్యాయకత్వ లక్షణాలు షర్మిలలో తాను చూసినట్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం వైఎస్‌కు ఘనమైన నివాళులు అర్పించారు. తరం మారుతున్నా జనం జ్ఞాపకాలలో తడి ఆరని సంతకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు రేవంత్‌. ఇలా ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతీచోటా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తమవాడేనని కాంగ్రెస్‌ చెప్పుకుంటోంది.

2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకుండాపోయింది. విభజనను వ్యతిరేకించిన ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. అందుకే 2014, 2019, 2024 ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అయితే 2024 జనవరిలో తన పార్టీ YTPని కాంగ్రెస్‌లో వీలినం చేసిన షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు అందుకున్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను గాడిలో పెట్టే బాధ్యతను భుజనకెత్తుకున్నారు. ఇక తన సొదరుడు జగన్‌కు వ్యతిరేకంగా విమర్శల బాణాలు సంధించారు షర్మిల. ఆమె మాటలను నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ బాగా యూజ్‌ చేసుకుంది. సొంత చెల్లెలే జగన్‌ను వ్యతిరేకిస్తుందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రచారం చేసుకుంది. ఏపీ ఎన్నికల్లో జగన్‌ ఘోరంగా ఓడిపోవడానికి ఇది కూడా ప్రధాన కారణం!

Also Read: ప్రజా భవన్ లో వైఎస్సార్ ఫొటో ఎగ్జిబిషన్-VIDEO

ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకోవడంతో ఫ్యాన్‌ పార్టీ నేతలంతా ఇతర పార్టీలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది బీజేపీ వైపు చూస్తున్నారని.. మరికొందరు కాంగ్రెస్‌ వైపు వెళ్తున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. నిజానికి ప్రస్తుత వైసీపీలో ఉన్న నేతల్లో చాలామంది ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నవారే. దీంతో నాటి నేతలను ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ వైఎస్‌ అస్త్రాన్ని వినియోగిస్తుందన్న టాక్‌ నడుస్తోంది. ఇటు జగన్‌ పార్టీ నేతలు మాత్రం వైఎస్‌ తమవాడేనని ఇప్పటికీ చెప్పుకుంటోంది. అందుకే కాంగ్రెస్‌తో పోటాపోటిగా వైఎస్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!

IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు.

New Update

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్‌ ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. బూత్‌ లెవల్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల తరపున పోరాటాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలన్నారు. ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దని హెచ్చరించారు. విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని చంద్రబాబు సర్కార్ ఊరు, పేరు లేని కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారన్నారు. రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. 

దిగజారిన వ్యవస్థలు..

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని ఈ సమావేశంలో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. IPS ఆంజనేయులు అరెస్ట్ ఈ పరాకాష్టకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెట్టుకొని ఎలాగైనా మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నాడని ఆరోపించారు.

(ys-jagan | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment