Jana Reddy: జానారెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా?

తనకు రాజ్యసభ టికెట్ వస్తుందని కోటి ఆశలతో ఉన్న జానారెడ్డికి నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో జానారెడ్డి పేరు లేదు. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే జానారెడ్డి నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Jana Reddy: జానారెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా?

Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న.. లేకున్నా పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించడం లేదని వాపోతున్నారట. అయితే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు జైవీర్‌రెడ్డి కి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని.. గెలిపించుకున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరవేశారు.

ALSO READ: కేసీఆర్‌కు హరీష్ రావు వెన్నుపోటు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజ్యసభ ఆశ.. నిరాశే!

కష్టకాలంలో కూడా పార్టీని వీడకుండా ఉన్న తనకు కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీటు ఇస్తుందని అనుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి. అయితే.. నిన్న (బుధవారం) కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ నుంచి పోటీ చేసే రాజ్యసభ సభ్యుల లిస్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తనకే రాజ్యసభ టికెట్ ఇస్తుందని కోటి ఆశలతో ఎదురు చూసిన జానారెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. దీంతో ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై గుస్సా అయినట్లు సమాచారం. సీనియర్ లీడర్ అయినా తన పేరు కాకుండా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారికి టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో జానారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే!

మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజ్యసభ టికెట్ ఆశించి భంగపడ్డ జానారెడ్డి.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. రాజ్యసభ రాలేదు కనీసం లోక్ సభకు వెళ్లేందుకు తనకు కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఇస్తుందనే ఆశతో ఉన్నారు. నల్గొండ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు జానారెడ్డి. ఎన్నికల్లో తనకు కాకపోయినా తన కుమారుడు రఘురెడ్డికి సీటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తునట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే నల్గొండ ఎంపీ టికెట్ ను గతంలో పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పెద్దలు చెప్పిన విషయం తెలిసిందే. ఎంపీ టికెట్ రాకపోతే జానారెడ్డి తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలో అనేక చర్చలకు దారి తీస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు