GHMC : గ్రేటర్‌ హైదరాబాద్‌పై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్‌.. కార్పొరేటర్ లే టార్గెట్!

లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే కార్పోరేటర్లకు వల విసురుతోంది. శ్రీలత శోభన్‌ రెడ్డిని కాంగ్రెస్‌లోకి రావాలని మైనంపల్లి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

New Update
GHMC : గ్రేటర్‌ హైదరాబాద్‌పై కాంగ్రెస్‌ స్పెషల్ ఫోకస్‌.. కార్పొరేటర్ లే టార్గెట్!

Hyderabad : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌(Hyderabad) పై కాంగ్రెస్ పార్టీ(Congress Party) మరింత ఫోకస్ చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని లోక్‌సభ (Lok Sabha) సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈసారి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వరుసగా కార్పొరేటర్లకు కాంగ్రెస్‌ వల విసురుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. కాగా మరో డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌ రెడ్డి బీఆర్ఎస్‌(BRS) వీడుతారని ప్రచారం జరుగుతోంది.

శోభన్‌ రెడ్డికి మైనంపల్లి ఆహ్వానం..
ఈ మేరకు శ్రీలత శోభన్‌ రెడ్డి(Srilatha Shoban Reddy) ని కాంగ్రెస్‌లోకి రావాలని మైనంపల్లి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా శోభన్ రెడ్డికి సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌తో విభేదాలున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేటర్లతో కేటీఆర్‌ నిర్వహించిన మీటింగ్‌కు డుమ్మా కొట్టినట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు పార్టీ నేతల తీరు ఇబ్బందులు గురిచేస్తోందని, మోతె శోభన్‌రెడ్డి కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కనీసం కీలక నేతలు తనకు 2 నిమిషాల అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా మొహం చాటేయడంపై శోభన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అలాగే పలు సందర్భాల్లోనూ పార్టీ పెద్దలు తనను అవమానిస్తున్నారని ఆవేదన చెందుతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుండగా ఇదే అసహనంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు శోభన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Delhi : ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చిన రైతులు.. బార్డర్లు మూసేసిన ప్రభుత్వం

మాణిక్ రావ్ ఠాక్రే ఆదేశాలు..
ఇదిలావుంటే.. గతంలో కాంగ్రెస్ పార్టీకి నగరంలో బలమైన పట్టు ఉండేది. సికింద్రాబాద్ లోక్‌సభ(Lok Sabha) తో పాటు గతంలో హైదరాబాద్ స్థానాన్ని కూడా గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మల్కాజిగిరి పార్లమెంటులో మాత్రమే కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు