Karnataka : సీఎంను మార్చడంపై సిద్ధిరామయ్య కీలక వ్యాఖ్యలు

కర్ణాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం సిద్ధిరామయ్య స్పందించారు.

New Update
Karnataka : సీఎంను మార్చడంపై సిద్ధిరామయ్య కీలక వ్యాఖ్యలు

Congress High Command Thinks : సిద్ధరామయ్య (Siddaramaiah) ను పక్కకుపెట్టి డీకే శివకుమార్‌ (DK Shiva Kumar) కు పాలనా పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్‌ సైతం ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నదని కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌ డిబేట్‌ సాగుతోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల సమక్షంలో ఇటీవల ఓ స్వామీజీ డీకేను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీనిని బేస్ చేసుకుని కాంగ్రెస్ హైకమాండ్ సీఎంను మార్చాలని అనుకుంటోందని ఊహాగానాలు నడుస్తున్నాయి.

ఇక సీఎం మార్పు వార్తలపై సిద్ధరామయ్యను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ప్రజల మధ్య చర్చించాల్సిన వ్యవహారం కాదని అన్నారు. పార్టీ హైకమాండ్‌ తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సీఎంను మార్చుతారనే వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడంపై నాయకత్వ మార్పు ఊహాగానాలు మరింత బలాన్ని ఇస్తున్నాయి. దీంతో సీఎం సిద్ధరామయ్యపై వేటు తప్పదా అని కాంగ్రెస్‌ (Congress) వర్గాల్లో చర్చ జోరందుకుంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్‌ వక్కలిగ వర్గానికి చెందిన వారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, మరిన్ని ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టించి లింగాయత్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి కేటాయించాలని సీఎంకు సన్నిహితంగా ఉన్న కొందరు మంత్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

Also Read:USA: అమెరికాలో హైదరాబాదీ మృతి..

Advertisment
Advertisment
తాజా కథనాలు