Mallikarjun Kharge: సాయంత్రం చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ!!

కాంగ్రెస్ చేవెళ్లలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాగర్జన సభను నిర్వహించబోతుంది. టీపీసీసీ అత్యంత ప్రతిష్టాత్మంకగా చేపడుతున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఏఐసీసీ చీఫ్ హోదాలో ఖర్గే తెలంగాణలో మొదటి సారి భారీ బహిరంగ సభలో హాజరై ప్రసంగించనున్నారు. దీంతో ఈ సభా ఏర్పాట్లపై టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. మరోవైపు..ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది..

New Update
Mallikarjun Kharge: సాయంత్రం చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ!!

Mallikarjun Kharge: కాంగ్రెస్ చేవెళ్లలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రజాగర్జన సభను నిర్వహించబోతుంది. టీపీసీసీ (TPPC) అత్యంత ప్రతిష్టాత్మంకగా చేపడుతున్న ఈ సభకు ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఏఐసీసీ చీఫ్ హోదాలో ఖర్గే తెలంగాణ(Telangana)లో మొదటి సారి భారీ బహిరంగ సభలో హాజరై ప్రసంగించనున్నారు. దీంతో ఈ సభా ఏర్పాట్లపై టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది.

ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్..! Dalit and Tribal Declaration

ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్లు, రాహుల్ గాంధీ ఇంకా ప్రియాంక గాంధీల చేత విడుదల చేయించిన కాంగ్రెస్ ఈ చేవెళ్ల సభలో కీలకమైన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను చేయాలని.. తద్వారా ఎన్నికల ప్రచారంలో వేడిని పెంచాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం జరగనున్న చేవెళ్ళ సభలో ఖర్గే ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. దీంతో పాటు మహిళా డిక్లరేషన్ ఇంకా పలు డిక్లరేషన్లపై టీపీసీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఒక దాని తరువాత ఒకటి విడుదల చేసి వాటినే మెయిన్ ఏజెండాగా మార్చుకొని ప్రజల్లో తీవ్రంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు టీపీసీసీ సీనియర్లు. మరో వైపు మేనిఫెస్టో పై కూడా టీపీసీసీ గట్టిగా కసరత్తు చేస్తోంది. మేనిఫెస్టోను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేత రిలీజ్ చేయించాలని భావిస్తున్నారు టీపీసీసీ సీనియర్లు.

ఖర్గే స్పీచ్ పై ఉత్కంఠ..!

ఇక ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణం మరో వైపు రాష్ట్రానికి మొదటి సారి ఏఐసీసీ హోదాలో ఖర్గే రావడంతో ఆయన సభలో ఏం ప్రసంగిస్తారనేది రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే పార్టీని ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు ఈసభను ఉపయోగించుకోనున్న నేపథ్యంలో ఖర్గే చేయనున్న ఎస్సీఎస్టీ డిక్లరేషన్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు క్రియాశీలకంగా అంశాలున్నాయన్న తరుణంలో ఖర్గే ఏం ప్రకటిస్తారనేది కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్కంఠగా మారింది. ఈ సభతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఓ మైలేజ్ పెంచేలా ఖర్గే స్పీచ్ ఉంటుందని నేతలంటున్నారు.

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలనే నినాదంతో పార్టీ శ్రేణుల్లో ఆయన జోష్ నింపే అవకాశముంది. అదే విధంగా ఇప్పటికే పార్టీ ప్రకటించిన రైతు, యూత్ డిక్లరేషన్ లోని కీలక అంశాలపై కూడా ఖర్గే ఈ సభా ముఖంగా వివరించే అవకాశముంది. ఇక దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని హైలైట్స్ ను కూడా ఖర్గే ఇన్ డైరెక్ట్ గా సభా ముఖంగా ప్రస్తావించే అవకాశముంది.

సభ కోసం భారీ ఏర్పాట్లు..!

ఇక చేవెళ్ల సభను టీకాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో సభను ఖమ్మం సభ తరహాలోనే సక్సెస్ చేయాలని భారీ ఏర్పాట్లను చేస్తోంది. ముఖ్యంగా భారీ ఎత్తున జన సమీకరణ కోసం పార్టీ శ్రేణులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా 10 లక్షల మందిని సభకు రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చిన వారి కోసం కూర్చోవడానికి అదే విధంగా పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా అరెంజ్ మెంట్స్ చేస్తున్నారు. వర్షా కాలం కావడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: 119 సీట్లు.. 1000 దరఖాస్తులు.. అప్లై చేయని టీకాంగ్రెస్ కీలక నేతలు ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు