Telangana : గుడ్‌న్యూస్.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ నిధులు విడుదల

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.725 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2024-25 బడ్జెట్‌లో భాగంగా కేటాయించిన నిధులను విడుదలకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బుద్ధ వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
Telangana : గుడ్‌న్యూస్.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ నిధులు విడుదల

Congress Government : తెలంగాణ (Telangana) ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. కల్యాణ లక్ష్మీ (Kalyana Lakshmi), షాదీ ముబారక్(Shaadi Mubarak) పథకాలకు రూ.725 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2024-25 బడ్జెట్‌లో భాగంగా కేటాయించిన నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ బుద్ధ వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకాల కింద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..

ఈ అంశం మీద సుధీర్ఘంగా కసరత్తుల చేసిన అనంతరం తాజాగా నిధులు విడుదల చేసింది. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడంతో పాటు తులం బంగారం కూడా లభించనుంది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఎన్నికల్లో హామీ ఉచ్చిన ఆరు గ్యారెంటీల్లో (6 Guarantees) అన్ని అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ హామీలు నేరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తాజాగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధులు విడుదల చేసింది.

Also Read:  తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు