Telangana: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. వారికి నో ఛాన్స్‌..

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రేషన్‌ కార్టు లేని వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజమైన అర్హులకే ఇవి జారీ చేసేలా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

New Update
Telangana: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. వారికి నో ఛాన్స్‌..

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్‌ సిద్ధమవుతోంది. త్వరలోనే రేషన్‌ కార్టు లేని వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆరు గ్యారంటీ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రేషన్ కార్టులు లేని కుటుంబాల నుంచి జాబితా సేకరించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:  ఫిబ్రవరి 9 నుంచి పుస్తక ప్రదర్శన..

రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్టుల కోసం మార్గదర్శకాలు జారీ చేయనుంది రాష్ట్ర సర్కార్. అయితే సొంత కారు, ఆదాయ పన్ను కట్టేవాళ్లకు రేషన్ కార్టులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజమైన అర్హులకే కొత్త కార్డులు జారీ చేసేలా కార్యాచరణ చేపడుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పరిశీలన తర్వాత కొత్త రేషన్ కార్డులు అధికారులు మంజూరు చేయనున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది మంది రేషన్ కార్డు లేని వాళ్లు ఉన్నారు. రేషన్ కార్టు ఉన్నవారికే ఆరు గ్యారెంటీలు అందుతాయని ఇటీవల సర్కార్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త రేషన్ కార్డులు లేనివాళ్లు వాటికోసం ఎదురుచూస్తు ఉన్నారు. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్‌ నిన్న (శుక్రవారం) జరిగిన సభలో త్వరలోనే రూ.500లకు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు?

Advertisment
Advertisment
తాజా కథనాలు