Telangana: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్‌ కీలక నిర్ణయం

తెలంగాణలో 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్‌లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది.

New Update
Telangana: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్‌ కీలక నిర్ణయం

LRS Scheme in Telangana: 2020 ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.

Also Read: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పది మంది వీఐపీల హస్తం!

నగర, పురపాలికలు, పంచాయతీ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించేందుకు.. గత ప్రభుత్వం 2020లో దరఖాస్తులకు ఆహ్వానించింది. దీనికి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టుల్లో పలువురు పిటీషన్లు వేయడంతో క్రమబద్దీకరణ చేపట్టే ప్రక్రియ ఆగిపోయింది. అయితే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగులపై ఉన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమ సహకారం ఉంటుందని ఆయన గతంలోనే భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: కాంగ్రెస్ అధికారంలోనే భారీ అక్రమాలు జరిగాయి..ఈటల సంచలన కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG vs GT: గుజరాత్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా పడిపోయిన వికెట్లు- 15 ఓవర్లకు ఎంత స్కోరంటే?

లక్నో vs గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో గిల్, సుదర్శన్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. కానీ వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ తగ్గిపోయింది. 15ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజ్‌లో రూథర్‌ఫోర్డ్, బట్లర్ ఉన్నారు.

New Update
LSG vs GT

LSG vs GT

ఐపీఎల్ 2025 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇరు జట్లు టైటిల్ కోసం పోటా పోటీగా మ్యాచ్‌లు ఆడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ మరో మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే టాస్‌ నెగ్గిన లక్నో జట్టు.. మొదట బౌలింగ్ ఎంచుకుంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

10 ఓవర్లలో 0 వికెట్లు

దీంతో సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చారు. మొదటి నుంచి ఓ వైపు దూకుడుగా.. మరోవైపు వికెట్లు నష్టపోకుండా పరుగులు రాబట్టారు. కొట్టాల్సిన దగ్గర పెద్ద పెద్ద షాట్లు కొట్టారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ఇలా 10 ఓవర్లలో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ పడకుండా 101 పరుగులు చేసింది. దీంతో 100 పరుగులు ఇచ్చినా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు తలలుపట్టుకున్నారు. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

రెండు హాఫ్ సెంచరీలు

అదే సమయంలో ఓపెనర్ గిల్‌(60)ను ఔట్ చేశారు. ఎట్టకేలకు ఓపెనర్ల భాగస్వామ్యానికి (73 బంతుల్లో 120 పరుగులు) లక్నో జట్టు తెరదించింది. ఇక ఆ తర్వాతే సాయి సుదర్శన్ కూడా పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్ ఆడే క్రమంలో సాయి సుదర్శన్‌ (56) క్యాచ్ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. రవి బిష్ణోయ్‌ వేసిన 13.1 ఓవర్లో నికోలస్‌ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి సుదర్శన్‌ వెనుదిరిగాడు. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ (2) సైతం వెను వెంటనే చేతులెత్తేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. దీంతో గుజరాత్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రూథర్ ఫోర్డ్ (1*), బట్లర్ (9*) పరుగులతో ఉన్నారు. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

( LSG vs GT | latest-telugu-news | IPL 2025)

Advertisment
Advertisment
Advertisment