Telangana: ముగ్గురు నేతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..

మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది.

New Update
Telangana: ముగ్గురు నేతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..

తెలంగాణలో నిన్న పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి‌లపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో బూత్‌ నెంబర్‌ 30 పూడూరు గ్రామంలో ఈటల రాజేందర్‌ 'ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్' అంటూ మాట్లాడి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని పేర్కొన్నారు. అలాగే సికింద్రాద్‌ పరిధిలోని బర్కత్‌పూర నియోజకవర్గంలో.. కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారని ఫిర్యాదు చేశారు.

Also Read: కలకలం రేపుతున్న ముంబయి హోర్టింగ్ ప్రమాదం.. 14 మంది మృతి..

మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్‌ నందిహిల్స్ పోలింగ్ స్టేషన్‌లో తెలంగాణ తెచ్చిన పార్టీ, లీడర్‌కు ఓటు వేయాలని అన్నారని.. ఇది కూడా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించనట్లేనని కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేట్ కమిటీ చైర్మన్ జీ నిరంజన్ ఫిర్యాదులో తెలిపారు. ఈ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ ఈరోజు.. షెడ్యూల్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు