/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T213838.294.jpg)
వైసీపీ (YCP) కీలక నేత, రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడుపై సంచలన ఫిర్యాదు నమోదు అయింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త దేవదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం (Pregnancy) దాల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య గర్భానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఓ గవర్నమెంట్ ప్లీడర్ కారణం అనే అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనరును కోరుతూ లేఖ రాశారు. ఈ మహిళా అధికారి ఇటీవలే సస్పెండ్ అయ్యారు. ఈ అంశంపై సదరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా (Social Media) లో ఈ రోజు ఉదయం నుంచే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇంత వరకు ఆ మహిళా అధికారి, ఆ వైసీపీ ఎంపీ ఇంత వరకు రియాక్ట్ కాలేదు.
Also Read : మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా?