Ambani: నగదు నిల్వ కంపెనీలలో అంబానీనే టాప్! భారత అగ్రసంస్థల్లో ఒకటైన రిలయన్స్ సంస్థ నగదు నిల్వ చేసే కంపెనీలలో రూ.2.08 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నట్టు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. ఆ తర్వాత రెండో స్థానంలో టాటా గ్రూప్ కు చెందిన టాటా మోటర్స్ 60వేల కోట్లతో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. By Durga Rao 08 Jul 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Reliance Industries: రూ.2.08 లక్షల కోట్ల నగదు నిల్వతో ఈ కంపెనీ అగ్రస్థానంలో ఉంది. మార్చి 31, 2024 నాటికి కంపెనీ నగదు నిల్వ రూ. 2.08 లక్షల కోట్లు. 2024 నాటికి ఈ కంపెనీ ఆదాయమే 9 లక్షల కోట్ల రూపాయలు. TATA: టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. 2024 నాటికి రూ.60 వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. కంపెనీకి అనుబంధంగా ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ 45వేల కోట్ల నగదును వచ్చే ఏడాది నాటికి రుణ రహిత కంపెనీగా మార్చనుంది. L&T: FY2024 నాటికి, కంపెనీ వద్ద రూ. 50వేల కోట్ల సిద్ధంగా నగదు ఉంది. FY2024లో కంపెనీ లాభం 25% పెరిగింది. కంపెనీ ఆదాయం కూడా 21% పెరిగి రూ.2.2 లక్షల కోట్లకు చేరుకుంది. TCS: టాటా గ్రూప్‌నకు చెందిన మరో కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వద్ద రూ.44వేల 296 కోట్ల నగదు ఉంది. భారతదేశంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలలో అత్యధిక నగదు నిల్వలు కలిగిన సంస్థ. ONGC: ప్రభుత్వ యాజమాన్యంలోని ONGC వద్ద రూ.42వేల కోట్ల నిల్వలు ఉన్నాయి. FY2024లో కంపెనీ నికర లాభం 40 శాతం పెరిగి రూ.49వేల కోట్లకు చేరుకుంది. Wipro: కంపెనీ నగదు నిల్వలు రూ.40 వేల కోట్లుగా ఉన్నాయి. FY2024లో కంపెనీ $4.6 బిలియన్ల విలువైన ఒప్పందాలను పొందింది. Infosys: కంపెనీ నగదు నిల్వలు రూ.39,005 కోట్లు. 2024లో ఈ కంపెనీ లాభం 26వేల 233 కోట్లు. దీని ఆదాయం 1.54 లక్షల కోట్లు. Indigo: విమానయాన సంస్థ వద్ద రూ.34,738 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. 20,823 కోట్లు రెడీ-టు-క్యాష్‌గా, 13,915 కోట్లు కన్వర్టబుల్ క్యాష్‌గా ఉన్నాయి. 2024 నాటికి కంపెనీ ఆదాయం 27% పెరిగింది. Coal India: కంపెనీ వద్ద రూ.33,486 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. FY2024లో కంపెనీ లాభం 33% పెరిగి రూ.37,402 కోట్లకు చేరుకుంటుందని అంచనా. #business-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి