NTR 100 Rupee Coin Release: ఎన్టీఆర్‌ నాణెం విడుదల.. ఆయన గురించి ముర్ము ఏం అన్నారంటే!

పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎంతో తపించారన్నారు రాష్ట్రపతి ముర్ము. రామారావు రూ.100 నాణాన్ని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రాముడు కృష్ణుడు లాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారని ఎన్టీఆర్‌ని కొనియాడారు ముర్ము.

New Update
NTR 100 Rupee Coin Release: ఎన్టీఆర్‌ నాణెం విడుదల.. ఆయన గురించి ముర్ము ఏం అన్నారంటే!

NTR 100 Rupee Coin Release : నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూ.100 నాణాన్ని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జయంతి శతజయంతి సంవత్సరాన్ని (NTR's Centenary Birth Anniversary) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 ముఖ విలువ కలిగిన ప్రత్యేక నాణేన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఎన్టీఆర్‌ గురించి ముర్ము ఏం అన్నారంటే?

➼ పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎంతో తపించారు.

➼ తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్‌ది చెరగని ముద్ర.

➼ రాముడు కృష్ణుడు లాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.

➼ ఆయన శత జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నా.

➼ తన చిత్రాలతో తెలుగు సంస్కృతిని ఎన్టీఆర్ సమున్నతం చేశారు.

➼ గతంలో తిరుపతి సందర్శించే జనాలు.. నుండి చెన్నై వచ్చి ఎన్టీఆర్‌ను దర్శించుకునేవారు.

➼ ఇలా ఎన్నో విషయాలు ఆయన గురించి ప్రచారంలో ఉన్నాయి.

ఎన్టీఆర్‌ ది గ్రేట్:
నందమూరి తారక రామారావు అంటే పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా చేసిన మంచి పనులతో కోట్లాది తెలుగు ప్రజలకు నిజమైన హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తెలుగు సాంస్కృతిక చిహ్నంగా పరిగణిస్తారు ప్రేక్షకులు. 'విశ్వ విఖ్యాత నట సార్వభౌమ'గా ప్రసిద్ధి చెందిన ఎన్టీఆర్‌ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను తమ సీట్లకు అతుక్కుపోయేలా చేసేది. స్క్రీన్‌పై ఏదో మ్యాజిక్ జరుగుతోందన్న భావన ఉండేది. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్‌ చేసిన విధంగా ఇంకెవరూ చేయాలేదన్నది తెలుగు ప్రజల మాట. రాముడు, కృష్ణుడు ఆయనలాగే ఉంటారేమో అని అనిపించేలా తన నటవిశ్వరూపాన్ని చూపించారు ఎన్టీఆర్‌. అంతేకాదు అటు సీఎంగానూ ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయన రాజకీయ నాయకుడు కాదు, కోట్లాది తెలుగు ప్రజలకు మార్గదర్శక శక్తి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి అధికార పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 1982లో తెలుగుదేశం పార్టీని (TDP Party) స్థాపించారు. తన రాజకీయ సంస్థను ప్రారంభించిన తొమ్మిది నెలల వ్యవధిలో, అతను సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఉమ్మడి ఏపీకి సీఎంగా ప్రమాణం చేశారు. తెలుగు రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ ఎన్టీఆరే.. అందుకే కేంద్రం ఆయన శతజయంతి సందర్భంగా నాణెం విడుదల చేసి ఎన్టీఆర్‌పై తమకున్న గౌరవాన్ని చాటుకుంది.

ALSO READ: ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ.. ఈసీకి వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు