Weather Alert: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి.. జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన

తెలంగాణలో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రికి చలిగాలులు వీస్తున్నాయని.. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. చలితీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

New Update
Weather Alert: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి.. జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశం విడిచి వెళ్లడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలి గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోందని చెప్పింది. అలాగే గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని.. అక్టోబర్ 27న సగటు కనిష్ట ఉష్ణోగ్రత 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు తెలిపారు.

Also Read: బీజేపీపై ఆగ్రహం.. బాబు మోహన్ సంచలన నిర్ణయం..

అలాగే గత రెండ్రోజులుగా రాత్రి సమయంలో చలిగాలులు వీస్తున్నాయని.. శుక్రవారం రాత్రి మల్కాజిగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 11.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా శేరిలింగంపల్లిలో 12.1 డిగ్రీల సెల్సియస్ నమోదైందని పేర్కొన్నారు. ఇక రాజేంద్రనగర్‌లో 12.6 డిగ్రీల సెల్సియస్, సికింద్రాబాద్, చందానగర్, కుత్బుల్లాపూర్‌లో 14 డిగ్రీల సెల్సియస్ నమెదైనట్లు పేర్కొన్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. మరోవైపు చలి తీవ్రత పెరుగుతుండడంతో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Also Read: కర్ణాటకకు రండి చూపిస్తాం.. కేసీఆర్, కేటీఆర్ కు డీకే శివకుమార్ సవాల్

Also Read: రెండు కుటుంబాలను ఆగం చేసిన అక్రమ సంబంధం.. సూర్యాపేటలో షాకింగ్ ఘటనలు

Advertisment
Advertisment
తాజా కథనాలు