Cobra: వలలో చిక్కుకున్న నాగుపాము.. ఎలా కాపాడారంటే..!!

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్ధిన నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. అయితే నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం భారతదేశంలో హింధూవులు అనాదిగా వస్తున్న ఆచారం. కాగా..అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నాగుపాము కలకలం రేపింది.

New Update
Cobra: వలలో చిక్కుకున్న నాగుపాము.. ఎలా కాపాడారంటే..!!

ఏపీలో ఓ నాగుపామును‌ స్నేక్ క్యాచర్ కాపాడిన్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం‌ చింతావానిరేవు వద్ద వలలో నాగుపాము చిక్కుకున్నది. రాత్రి నుంచి వలలో చిక్కుకుని విలవిలలాడుతుండగా, ఆ నాగుపామును వలలో నుంచి విడిపించిన‌ స్నేక్ కాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అక్కడకు చేరుకున్న వర్మ పామును వల నుంచి క్షేమంగా బయటకు తీశాడు. ఈరోజు పవిత్రమైన నాగులచవితి కావడంతో ఆ నాగుపాముకు పాలుపోసి, పసుపు కుంకుమ చేసి పూజలు చేశారు గ్రామ ప్రజలు. పండగ రోజు పాటు ఇంటికి రావటం.. పూజలు చేయడం సంతోషంగా ఉందని మహిళలు చెబుతున్నారు. అనంతరం పామును సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టేందుకు వర్మ తనవెంట తీసుకువెళ్లాడు.

అయితే..ఎక్కువగా గుడిలో, ఊరి బయట ఉన్న పుట్టలలో భక్తులు పాలు పోసి నాగుల చవితి పండుగ చేసుకుంటారు. చవితినాడు సర్పాలను (పాములను) పూజిస్తే సర్వ రోగాలు పోయి.. వైవాహిక దాంపత్య దోషాలతోపాటు గర్భదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. నాగుల చవితినాడు నాగేంద్రుడు శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆదిశేషుడుగా తోడు ఉంటాడని పురాణాలు కథలు చెబుతున్నాయి. నాగుల చవితి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల్లోని నాగేంద్రునికి పాలాభిషేకం పూజలు చేశారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా నాగేంద్రునికి మహిళా భక్తులు పాలాభిషేకంతో పాటు దీపాలు వెలిగించి పూజలు చేశారు.

నాగజాతికి పురాణేతిహాసాలలో విశిష్ట స్థానం ఉంది. కార్తీక మాసంలో శుక్ల పక్ష రోజున చవితిరోజున నాగులచవితి పండుగ పర్వదినంగా జరుపుకుంటారు. నాగులను విష్ణుమూర్తి తన శయ్యగా మార్చుకున్నాడు, నాగులను శివుడు తన ఆభరణాలుగా చేసుకున్నాడు. నాగులను విఘ్నేశ్వరుడు తన యజ్ఞోపవీతంగా చేసుకున్నాడు. ప్రకృతిలో 50 లక్షల జీవరాశులలో నాగజాతి ఒకటి. నాగులు రజోస్వభావం కలిగినవి కావున వాటికి క్రోధం ఎక్కువగా ఉంటుంది. నాగుల తోకమీద చూసి, చూడక కాలు వేస్తే వెంటనే అవి కాటేస్తాయి. అందుకే చాలామందికి నాగుపాములంటే చాలా భయం ఉంటుంది. కాగా.. విషభరితమైన నాగులను ఆరాధిస్తే భయం ఉండదని భక్తుల నమ్మకం. ఆ విశ్వాసమే నాగారాధనకు కారణం అయిందని విజ్ఞులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: సంతాన సమస్యలున్నాయా..? ఎరుపురంగు పండును తిని చూడండి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు