TS: యాదాద్రి సాక్షిగా భట్టికి అవమానం.. రేవంత్ పై విమర్శలు!

యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విషయంలో సీఎం రేవంత్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. పూజ సమయంలో అందరూ పెద్ద పీటలపై కూర్చొని భట్టిని చిన్న పీటపై కూర్చోబెట్టడంపై పలువురు మండిపడుతున్నారు. బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు ఇది అవమానమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
TS: యాదాద్రి సాక్షిగా భట్టికి అవమానం.. రేవంత్ పై విమర్శలు!

Bhatti Vikramarka Insulted: యాదగిరిగుట్టలో (Yadagiri Gutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దంపతులు పాల్గొని పూజలు చేశారు. సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి రేవంత్ ఆలయాన్ని సందర్శించారు. అతిథులందరికీ ఆలయ కమిటీ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలకగా.. వారంతా నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

publive-image

దేవుడి సాక్షిగా అవమానం..
ఇంతవరకూ బాగానే ఉన్నా... డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) విషయంలో సీఎం రేవంత్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. పూజ సమయంలో రేవంత్‌, ఉత్తమ్‌ కుమార్‌, కోమటిరెడ్డి, సురేఖ పీటలపై ఆసీనులవగా భట్టి మాత్రం పీటపై కాకుండా నేలపై కూర్చోవడంపై చర్చనీయాంశమైంది. దీంతో దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రికి, మహిళా మంత్రికి దేవుడి సాక్షిగా అవమానం జరిగిందంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

publive-image

ఇది కూడా చదవండి: Pawan Politics: ముక్కూటమి కుదిరింది.. జనసేనానికి త్యాగమే మిగిలిందా?

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చిన్న పీట వేసి.. సీఎం దంపతులు, మిగతా మంత్రులు పెద్ద పీటల్లో కూర్చోవడం బాధకరమంటూ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్, బాల్క సుమన్ (Balka Suman) లు దేవుడి సాక్షిగా ఉపముఖ్యమంత్రికి ఘోర అవమానం జరిగిందంటూ తమదైన స్టైల్ లో విమర్శలు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు