Telangana : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన సీఎం రేవంత్.. ఏమన్నారంటే!

ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కేంద్రంలో ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 9-12 ఎంపీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

New Update
Telangana : తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌.. ఫొటో వైరల్

CM Revanth : ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) ఎలా ఉన్నా కేంద్రంలో ఇండియా కూటమే (India Alliance) అధికారంలోకి వస్తుంని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం సాయంత్ర మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో 9-12 ఎంపీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే జూన్ 2న జరపబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ (Sonia Gandhi) వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, తెలంగాణను వ్యాపార వస్తువుగా మార్చి కేసీఆర్ లాభం పొందాలని చూశారంటూ విమర్శించారు. పీసీసీపై ఏఐసిసి నిర్ణయం ఫైనల్ అయిందని చెప్పారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను చంపిన రాజులుగా కాకతీయులను చూస్తామన్నారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో ఏదున్నా అందెశ్రీ చెప్పాలి. పవర్ కట్స్ రాష్ట్రంలో లేవు. లోకల్ లీడర్లు, కింది స్థాయి అధికారులను పట్టుకొని హరీష్ రావు చిల్లర డ్రామాలు చేస్తుండు. రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు. రైతులు ఒకే బ్రాండ్ ను కోరుతున్నారు. ఎరువులు, విత్తనాలు డిమాండ్ పై 10 శాతం అధికంగా తీసుకొచ్చాం. అమరవీరులను గుర్తించేందుకు కమిటీ వేసి వారి కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు.

ఇక కాలేశ్వరం, మేడిగడ్డపై ఎన్డీఏస్ఏ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా అవతరణ వేడుకలకు కేసీఆర్ రావాల్సి ఉంది. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కేసీఆర్ కు గౌరవం లేదు. భారత దేశ స్వాతంత్ర విషయంలో పాకిస్తాన్ ఒకరోజు ముందుగానే వేడుకలు చేసుకుంటున్నట్టు కేసీఆర్ చేసుకుంటుండు. అఖిలపక్షంలో పిలుద్దాం అనుకుంటే రోడ్డెక్కి ఆందోళన చేస్తుండ్రు. వేడుకలకు అందర్నీ పిలిచాం. బిజెపిని ఇగ్నోర్ చేయలేదు. రూ.1000 కోట్లతో అమరవీరుల స్థూపం కట్టాలని గతంలోనే నేను డిమాండ్ చేశా. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ ముళ్ళకంచలు వేయలేదు. రాష్ట్రంలో విద్య, స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నా. బీసీ కుల గణన చేసేందుకు ఆర్డర్ చేశాం. త్వరలోనే కులగనణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read : 🔴 Exit Polls Live Updates: గెలిచేదెవరు?.. ఎవరికి ఎన్ని సీట్లు?

Advertisment
Advertisment
తాజా కథనాలు