/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rrrrr-jpg.webp)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపై సీఎంవో స్పందించింది. సీఎం ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది.
ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారిని వారి నివాసంలో రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ @KomatireddyKVR, శ్రీ పైళ్ల మల్లారెడ్డి (యూఎస్ఏ), శ్రీ సాత్విక్ రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. pic.twitter.com/HXEJbXDECd
— Telangana CMO (@TelanganaCMO) December 25, 2023
ఇక సీఎం రేవంత్ తీవ్ర గొంతు నొప్పితో బాధపడుతున్నారని, అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరమయ్యారని ప్రచారం జరిగింది. అంతేకాదు మరికొందరు సీఎం రేవంత్‌కు జ్వరం వచ్చిందని, కరోనా టెస్ట్ చేశారంటూ న్యూస్ క్రియేట్ చేశారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన స్పందించిన సీఎంవో ఈ ప్రచారాలన్నింటిని ఖండించింది. సీఎం ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. అలాగే ఇవాళ మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ రేవంత్‌ని కలిసిన పలు అంశాలపై చర్చించినట్లు స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి :భార్యను ఎప్పుడూ మత్తులోనే ఉంచాలి.. హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
అలాగే ఆదివారం ఉదయం 10 గంటలకే రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల కాన్ఫెరెన్స్ ఉండగా.. ముఖ్యమంత్రికి పది నిమిషాల ముందే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. నిజానికి ఆ సమావేశాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకే నిర్వహించాలనుకున్నారు. కానీ అది మూడు గంటల వరకు సాగింది. కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో సీఎం కొంత నీరసంగా కనిపించినప్పటికీ.. కార్యక్రమాన్ని కొనసాగించారు. అసెంబ్లీ సమావేశాలు గత గురువారం ముగిశాయి. ఆ మరుసటి రోజు నుంచి సీఎం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శుక్రవారం ఆయన సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరయ్యారు. శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని ఏర్పాటు చేసిన గిగ్ వర్కర్ల సమావేశానికి హాజరయ్యారు. సీఎం రేవంత్ రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నతాధికారులతో పలు సమీక్షలు నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించారు.