Seethakka : కవితకు సీతక్క కౌంటర్.. జీవో నెంబర్ 3పై సెటైర్లు! మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. కానీ స్త్రీలను కాంగ్రెస్ కు దూరం చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన జీవో నెం 3 రద్దు చేయాలని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. By srinivas 10 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణ(Telangana) కాంగ్రెస్ మంత్రి సీతక్క(Congress Minister Seethakka) జీవో నెంబర్ 3పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్(BRS) హయాంలో తెచ్చిన జీవోను ఇప్పుడు రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రోడ్డెక్కి ధర్నాలు చేయడం వింతగా ఉందన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిలో రూ.68 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత ఆశలన్నీ గల్లంతు.. ఈ మేరకు సీతక్క మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) లక్ష్యం అని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు ఒకటో తేదీనే జీతాలు ఇస్తోందని, కాంగ్రెస్ సర్కారు మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోందని ఆమె అన్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను సీఎం కావాలని ఆమె భావించారని, పార్టీ ఓటమితో ఆశలన్నీ గల్లంతయ్యాయని విమర్శలు గుప్పించారు. అంతేకాదు కాంగ్రెస్ నుంచి మహిళలను దూరం చేయాలని కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది కూడా చదవండి : Telangana : పాలలో విషం కలిపి పసిగుడ్డులను చంపిన పేరెంట్స్!? జీవో నెంబర్ 3 ఇచ్చిందే కేసీఆర్.. 'కవిత జీవో నెంబర్ 3కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు జీవో నెంబర్ 3 ఇచ్చిందే కేసీఆర్ సర్కారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం బంద్ చేయాలి. నిర్మాణాత్మక విపక్షంగా పనిచేయాలి’ అని సీతక్క సూచించారు. ఇక విద్య వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కేయూ భూమి ఎలాంటి కబ్జాలకు గురికాకుండా ప్రహరీ నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ యువతను విస్మరించిందంటూ ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. #congress #minister-seethakka #brs-mlc-kavitha #cm-revant-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి