CM Revanth: అందుకే కిషన్ రెడ్డికి ఫోన్ చేశాను.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాను తెలంగాణ బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశాననే దానిపై వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం ప్రతిపక్ష గొంతులు నొక్కదాని.. తమది ప్రజాపాలన అంటూ హరీష్ రావుపై చురకలు అంటించారు.

New Update
Kishan Reddy : నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్!

CM Revanth Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (BJP Chief Kishan Reddy) ఫోన్ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కిషన్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశాడో వివరించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రం పక్క రా ష్టం అధికారులు తయారు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులను ఈ రకంగా అవమానించడం సరికాదన్నారు. నిన్న (బుధవారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే.

ALSO READ: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిశాఖ నివేదికను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మాట్ లో నింపి సంతకాలు చేసిన అనంతరం ఆర్థిక శాఖకు పంపితే ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిన నివేదికనే ప్రభుత్వం విడుదల చేసిందని తేల్చి చెప్పారు. ఇలాంటి నివేదికపై హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడం సరికాదని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనేక మంది కలుస్తారని, బీఆర్ఎస్ (BRS Party) ప్రభుత్వం లాగా తాము కక్షపూరితంగా అగౌరవపరిచేలా ప్రతిపక్షాలపై వ్యవహరించబోమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తానే స్వయంగా ఫోన్ చేశానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ఒకటే అని తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం లేదా ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అఖిలపక్ష సమావేశాలు పెట్టి.. బారి అభిప్రాయాలు తీసుకుంటామని అన్నారు. తమది నిజాం పాలన కాదు.. ప్రజల పాలన అని వ్యాఖ్యానించారు.

ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు