RYTHU BANDHU : రైతుబంధుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఉద్యోగులతో పాటు వారికి కట్?

రైతుబంధు స్కీమ్ పై రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబుతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. సాగులో ఉన్న భూములకే రైతు బంధు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కట్టే వారికి నిలిపివేత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
Rythu Bandhu: రైతు బంధు కింద రైతుల అకౌంట్లోకి రూ. 1. మీకు ఎంత వచ్చిందో చెక్  చేసుకోండి..!!

Telangana : రైతుబంధు పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతుబంధు (RYTHU BANDHU) స్కీంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సాగుచేసే వారికే పెట్టుబడి సాయం ఇచ్చే యోచన ఉందని సమాచారం. డిసెంబర్‌ చివరి వారంలో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. స్కీంలో మార్పులపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. రైతు భరోసా సాయం చిన్న, సన్నకారు రైతులకే ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Batti Vikramarka: కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్థమే.. భట్టి ఫైర్..

నిజంగా వ్యవసాయం చేసేవారికి రైతు భరోసా ఇద్దామన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. పడావు పడ్డ భూములకు పెట్టుబడి సాయం ఎందుకు? అన్న అంశంపై కూడా అధికారులు, మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతుబంధు కట్? చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఐటీ కట్టేవాళ్లకు కూడా రైతుబంధులో కోత ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో సాగు అవుతున్న భూములు, వాటికి అందుతున్న సాయంపై పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. రైతు బంధు సాయాన్ని 5 లేదా 10 ఎకరాలకే పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఈ సమావేశంలో రైతుబంధు సాయంతో పాటు విద్యుత్‌శాఖలో రూ. 81 వేల కోట్ల అప్పులపైనా చర్చ జరగనుంది. సీఎం క్యాంప్‌ ఆఫీసుగా MRCHRDIని మార్చడంపైనా సీఎం చర్చించనున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు