CM Revanth Reddy : అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

TG: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు చేయూలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రేపు అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.

New Update
CM Revanth Reddy : అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు

DS Srinivas : కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత డీఎస్‌ మృతి పట్ల తెలంగాణ (Telangana) సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు చేయూలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రేపు అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.

1989 నుంచి రాజకీయ ప్రస్థానం..

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డి. శ్రీనివాసు (D Srinivas) ఈరోజు గుండెపోటుతో తెల్లవారుజామున 3గంటలకు మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు డీఎస్. 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ లో జన్మించారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.

2014 తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి బీర్ఎస్లో చేరారు డి. శ్రీనివాస్. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్ను వీడి సొంతగూటి కాంగ్రెస్లో చేరారు. డి. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిజామాబాద్ మేయర్గా పని చేశారు డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్. నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్. రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read : కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. తెలంగాణలో కూటమి జట్టుకు మొదటి మెట్టయిందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు