Telangana: అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్-వద్దన్న ఓవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.డిప్యూటీ సీఎం పదవితోపాటు ఏకంగా తన పక్కనే కూర్చొబెట్టుకుంటానని చెప్పారు. దీనికి ఓవైసీ తాను ఎంఐఎం పార్టీలో సంతోషంగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చారు. By Manogna alamuru 28 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడిగా బడ్జెట్ పై వాదోపవాదాలు కొనసాగాయి. ఈ తరుణంలోనే.. శనివారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు అది కూడా డిప్యూటీ సీఎం పదవితోపాటు ఏకంగా తన పక్కనే కూర్చొబెట్టుకుంటానంటూ పేర్కొన్నారు. దీనికి స్పందించిన అక్బరుద్దీన్ తాను ఎంఐఎం పార్టీలో సంతోషంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు సమయం ఇచ్చారని తమకు నాలుగేళ్ల సమయం ఇస్తే చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్ లో మిమ్మల్ని ఓటు అడుగుతానంటూ పేర్కొన్నారు. తాను గతంలో ఓబీసీ వ్యక్తికి టికెట్ ఇచ్చానని, తమకు కూడా ఓబీసీలపై ప్రేమ ఉందని ఎంఐఎం అతని గెలుపు కోసం సహకరించాలంటూ కోరారు. ఈ క్రమంలో అక్బరుద్దీన్ స్పందిస్తూ తాము ఎటువెళ్లాలంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.కాంగ్రెస్ బీఫామ్‌పై కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యతను తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా ఉండి ఆయనను గెలిపిస్తానని తెలిపారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా అక్బరుద్దీన్‌ను తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని చెప్పారు. అయితే, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడంతో సభలో నవ్వులు విరిశాయి. ఓ వైపు సీఎం.. మరోవైపు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ వ్యాఖ్యలను అందరూ ఆసక్తిగా వింటూ నవ్వుకున్నారు. Also Read:Telangana: హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదన్న కోమటిరెడ్డి #cm-revanth-reddy #assembly #telngana #akbaruddein-owisi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి