Revanth: మేము మొదలుపెడితే అక్కడ ఎవరూ మిగలరు.. బీఆర్ఎస్ కు సీఏం వార్నింగ్! బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో తమను ఓడించేందుకు బీజేపీతో జతకట్టిన బీఆర్ఎస్ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ మిగలరని అన్నారు. By srinivas 11 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమను ఓడించేందుకు బీజేపీతో జతకట్టిన బీఆర్ఎస్ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తుందన్నారు. అలాగే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను మభ్య పెట్టాలని చూస్తోందని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ మిగలరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలే.. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ‘ప్రజాదీవెన’ సభలో సీఏం రేవంత్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలే. ఖమ్మం జిల్లాలో మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించాం. ఈ ఇండ్లు పేదలకు దేవాలయాలు. వీటి నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వంలో హామీలను అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారు. అందుకే ఖమ్మం జిల్లా ప్రజలు భారాసను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టారు' అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే తాము ఊరుకోమన్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఒక్కరోజులో ఖతం అవుంతుందన్నారు. ఇది కూడా చదవండి: Emily Willis: డోస్ ఎక్కువై కోమాలోకి వెళ్లిన పోర్న్ స్టార్.. సోషల్ మీడియాలో సోదరుడి ప్రచారం! భద్రాద్రి రాముడిని కేసీఆర్ మోసం చేశారు.. అలాగే ప్రజల బాధలు చూడలేకే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని చెప్పారు. హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. సొంతింటి కల సాకారం కోసం ప్రజలు పదేళ్లుగా ఎదురుచూశారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకూ పట్టాలు ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడికి సొంతిల్లు ఇవ్వలేకపోయింది. భద్రాచలం అభివృద్ధికి మా వద్ద కార్యాచరణ ప్రణాళిక ఉందని చెప్పారు. ఇక భద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశారని, ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారంటూ మండిపడ్డారు. #brs #cm-revanth #allegations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి