FREE BUS SCHEME: రయ్.. రయ్.. మహిళలందరికీ ఫ్రీ బస్సు సర్వీస్ స్టార్ట్.. జీరో టికెట్ ఎలా ఉందో చూడండి!

తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్‌ ప్రారంభించారు సీఎం రేవంత్‌ రెడ్డి. టీఎస్‌ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం లేదు. వారం రోజుల తర్వాత తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.

New Update
FREE BUS SCHEME: రయ్.. రయ్.. మహిళలందరికీ ఫ్రీ బస్సు సర్వీస్ స్టార్ట్.. జీరో టికెట్ ఎలా ఉందో చూడండి!

CM Revanth Reddy launched Free Bus Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నేటి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహలక్ష్మి పథకానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు వయస్సుతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో ఎక్కడైనా టీఎస్‌ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించవచ్చు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఉచితంగా ప్రయాణించి ఆ తర్వాత టికెట్‌ తీసుకోవలసి ఉంటుంది. మహిళలు ప్రయాణించే టికెట్‌ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీకి చెల్లించనున్నది.

Also Read: ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్..!


టీఎస్‌ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి ఆధారం చూపించాల్సిన అవసరం లేకున్నా ప్రయాణించే అవకాశం కల్పించింది. వారం రోజుల తర్వాత తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు బస్‌పాస్‌లను కూడా జారీ చేస్తారు. ఇక ఆ బస్‌పాస్‌ను చూపించాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అనేక అనుమానాలు వ్యక్తం కాగా, వాటిని నివృత్తి చేయడంతోపాటు నేటి నుంచే అమలులోకి తేవడం హర్షణీయమని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు