Revanth Reddy : సొంత జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన సొంత జిల్లా మీద ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్‌, నాగర్‌ కర్నూలు పార్లమెంట్‌ స్థానాల దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్నారు

New Update
Revanth Reddy : సొంత జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్

CM Revanth Reddy : తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) తన సొంత జిల్లా మీద ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్‌(Mahabubnagar), నాగర్‌ కర్నూలు(Nagarkurnool) పార్లమెంట్‌ స్థానాల పై దృష్టి సారించారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల పై ప్రత్యే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు , ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యమైన నేతలతో ఆయన సమావేశమయ్యారు.

దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాల పై నేతలతో రేవంత్‌ మాట్లాడారు. ఈ క్రమంలోనే బూత్‌ ల వారీగా నేతలు బాధ్యతలు తీసుకుని పని చేయాలన్నారు. కాంగ్రెస్‌ అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో వివరించాలన్నారు.

నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్నారు. మూడు నెలల కాలంలో ప్రభుత్వం అందించిన గ్యారంటీల గురించి చెప్పాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేకులు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గృహలక్ష్మి పథకానికి అడ్డంకులు ఎదురయ్యాయి. గత నెల 27న గృహలక్ష్మి పథకానికి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే 26 నుంచే మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఎంపీ ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉంది. మరోవైపు గృహలక్ష్మిపై జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే పథకానికి బ్రేక్‌ పడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు గృహలక్ష్మికి బ్రేక్ తప్పనిసరి. దీంతో జీరో బిల్లులకోసం జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.

Also Read :  లండన్‌లో భారతీయ విద్యార్థిని దుర్మరణం..ఆమె నీతి ఆయోగ్‌ లో కూడా!

Advertisment
Advertisment
తాజా కథనాలు