CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రేవంత్ సర్కార్ షాక్

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్‌ రోడ్లు, భవనాలు నిర్మించినట్లు అధికారులు గతంలో గుర్తించినట్లు తెలిసింది.

New Update
CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రేవంత్ సర్కార్ షాక్

CM Revanth Reddy: అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్‌ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి, అతని అల్లాడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. మొన్న మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చి వేసిన రేవంత్ సర్కార్.. తాజాగా మల్లారెడ్డి అల్లుడి విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాల కూల్చివేస్తోంది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన 2 శాశ్వత బిల్డింగులు, 6 తాత్కలిక షెడ్లను కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చి వేస్తున్నారు HMDA అధికారులు. 8 ఎకరాల చెరువును కబ్జా చేసి దుండిగల్‌ లోని MLRIT, ఏరోనాటికల్ కాలేజీల పార్కింగ్, భవనాలను MLA రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారని గతంలో అధికారులు గుర్తించారు. దీనిపై వారం కిందట అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆయన నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు.

మొన్న మల్లారెడ్డి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. మల్లారెడ్డి ఆక్రమించిన స్థలంలో నిర్మాణాల కూల్చి వేశారు అధికారులు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని HMDA లేఅవుట్లో 2500 గజాల స్థలం మల్లారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ కోసం మల్లారెడ్డి (Malla Reddy) రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో మల్లారెడ్డిపై రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మల్లారెడ్డి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఇప్పుడు ఆ ఆక్రమణలపై మేడ్చల్‌ కలెక్టర్‌ ఫోకస్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. HMDA లేఅవుట్లో వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు.

ALSO READ: లోక్ సభ ఎన్నికలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన

రేవంత్ యాక్షన్.. మల్లారెడ్డి రియాక్షన్..

తన స్థలంలో నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేయడంపై స్పందించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తనపై కొందరు నేతలు కావాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపించారు. ప్రస్తుతం అధికారం, అధికారులు వల్ల చేతుల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారని అన్నారు. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజ్‌కి రోడ్డు వేశామని తెలిపారు. 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి గత ప్రభుత్వ హయాంలో ఇచ్చామని పేర్కొన్నారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేస్తున్న ఈ పనితో ఇక పై తమ కాలేజ్ వద్ద ట్రాఫిక్ సమస్య భారీగా పెరిగిపోతుందని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు