CM Revanth : జీవన్ రెడ్డి విషయంలో తప్పు మాదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

జీవన్‌రెడ్డి విషయంలో పీసీసీదే తప్పని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ సమన్వయ లోపం కారణంగానే గందరగోళం నెలకొందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ చేరిక గురించి ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం తప్పేనన్నారు.

New Update
CM Revanth : జీవన్ రెడ్డి విషయంలో తప్పు మాదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

CM Revanth Reddy : ఢిల్లీ (Delhi) లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) విస్తరణపై ఏ చర్చ జరగలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ శాఖలు ఖాళీగా లేవని.. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారన్నారు. జీవన్‌రెడ్డి (Jeevan Reddy) కొంత మనస్తాపానికి గురయ్యారని అయితే, ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయెద్దని హెచ్చరించారు.

Also Read: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్‌ రన్‌ సక్సెస్.. 10లక్షల ఎకరాలకు సాగునీరు..!

నిర్ధిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రుణమాఫీ (Runa Mafi), రైతుభరోసా (Rythu Bharosa) విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తామన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల సమస్యలపై సమర్యాసంగా పరిష్కరించుకుంటామన్నారు. విద్యుత్‌పై విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాధించలేదని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు