TS New Cabinet: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే!

ఉత్తమ్ కుమార్ రెడ్డి హోం శాఖ, భట్టి విక్రమార్కకు రెవెన్యూ, శ్రీధర్ బాబుకు ఆర్థిక, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి,

New Update
TS New Cabinet: హోం మంత్రిగా ఉత్తమ్, సీతక్కకు గిరిజన సంక్షేమం.. కొత్త మంత్రుల శాఖలివే!

తెలంగాణలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శాఖలు కేటాయించారు. కీలకమైన హోం శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మునిసిపల్ శాఖను కోమటిరెడ్డికి, రెవెన్యూను భట్టి విక్రమార్కకు.. ఆర్థిక శాఖను శ్రీధర్ బాబుకు కేటాయించారు. సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. ఈ రోజు సాయంత్రంలోగా ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరననుంది.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ కు మోడీ, హరీష్ రావు, లోకేష్ శుభాకాంక్షలు

ఉత్తమ్ కుమార్ రెడ్డి - హోమ్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మునిసిపల్

శ్రీధర్ బాబు - ఆర్ధిక శాఖ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి - నీటి పారుదల

కొండా సురేఖ - స్త్రీ, శిశు సంక్షేమం

పొన్నం ప్రభాకర్: బీసీ సంక్షేమ శాఖ

భట్టి విక్రమార్క- రెవెన్యూ

దామోదర రాజనర్సింహ - మెడికల్ అండ్ హెల్త్

జూపల్లి కృష్ణారావు- ఫౌర సరఫరాలు

సీతక్క-గిరిజన సంక్షేమం

తుమ్మల-రోడ్లు, భవనాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు