CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం రేవంత్. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పేర్కొన్నారు. దీని వల్ల 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు.

New Update
CM Revanth: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..ఆగస్టు 15 నాటికి..!

Hyderabad - Genome Valley with Rs 2,000 Crore: త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ 2024 అవార్డుకు ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహిత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్.సెమెంజాను (Gregg L. Semenza) సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో (Minister Sridhar Babu) కలిసి సెమెంజాకు అవార్డును అందించారు.

పది ఫార్మా విలేజీలు..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మూడు వందల ఎకరాల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీంతో మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయ వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక గంట ప్రయాణ దూరంలోని అత్యంత సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఎంతో సదుపాయంగా ఉంటుంది.’ అన్నారు.

ALSO READ: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్..

కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న బయోఏషియా సదస్సు (BioAsia 2024 Conference) కీలకంగా మారిందని సీఎం అన్నారు. బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందని అన్నారు. వైరస్ భయాలను ధీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందని, ఇప్పుడు ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతోందని గుర్తు చేశారు.

ప్రభుత్వం అధిక ప్రాధాన్యత..

ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరి సమస్యలు ఒకేలా ఉన్నాయని కోవిడ్ నిరూపించిందని, అయితే సమస్యల పరిష్కారాలను కూడా మనం కలిసికట్టుగానే సాధించాలని సీఎం సూచించారు. ఒక్క బయో సైన్సెస్ లోనే కాదు, ఐటీ-సాఫ్ట్ వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అనుకూల వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. చిన్న స్టార్టప్ లు, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వారధిగా నిలిచే ఎంఎస్ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.

"మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే.. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే రాకెట్ లా మా ప్రభుత్వం పనిచేస్తుంది" అని సీఎం వ్యాఖ్యానించారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీ స్థాయిలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ఏటా 5కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తే లక్ష్యంగా ప్రఖ్యాత టకేడా సంస్థ ఇక్కడి బయోలాజికల్-ఈ సంస్థతో కలిసి హైదరాబాద్ లో తయారీ కేంద్రం నెలకొల్పడాన్ని స్వాగతించారు. వైరస్ ల వల్ల ప్రపంచంలో నెలకొన్న భయాలకు హైదరాబాద్ నుంచి నమ్మకాన్ని కల్పిస్తున్నామని సీఎం అన్నారు. జర్మనీకి చెందిన మిల్టేనీ సంస్థ తన రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని చెప్పారు. మానవాళికి మంచి చేసే చర్చలు, ముందడుగుతో హైదరాబాద్ బయో ఏషియా సదస్సు విజయవంతం కావాలని సీఎం ఆకాంక్షించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మూలిక వరం

రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిన్నప్పుడు మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ముస్లి మూలిక బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

New Update

Diabetes: ఇటీవలి కాలంలో చాలా మంది బాధపడుతున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఒక వ్యక్తికి డయాబెటిస్ వచ్చిన తర్వాత జీవితాంతం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆహారం, పానీయాల వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ముస్లి మూలిక బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

జీర్ణ సమస్యలు ఉపశమనం:

తెల్ల ముస్లి అనేది ఆయుర్వేదంలో ఒక మూలికగా పరిగణించబడే అడవి మొక్క. దీనిని తరచుగా తెల్ల బంగారం లేదా దైవిక ఔషధం అని పిలుస్తారు. తెల్ల ముస్లిని శాస్త్రీయంగా క్లోరోఫైటమ్ బోరివిలియనం అని పిలుస్తారు. ఇది ఆయుర్వేదంలో శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది స్త్రీ, పురుషులలో లైంగిక శక్తిని, శారీరక బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. దీనికి గుండె సంబంధిత వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంది. తెల్ల ముస్లీలో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కడుపు నొప్పి, విరేచనాలు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

మహిళల్లో తల్లి పాలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది పురుషులు,  స్త్రీలలో మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తెల్ల ముస్లీని ఆయుర్వేదం, యునాని, హోమియోపతిలో ఉపయోగిస్తారు. దీన్ని తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని చాలా మంది వైద్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  ఈ మొక్క జాతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతోంది. వైద్యులు, నిపుణుల సలహా మేరకు మాత్రమే తెల్ల ముస్లీని తినాలి. ఈ ఔషధం కొంతమందిలో అలెర్జీలకు కారణం కావచ్చు. దాని వినియోగాన్ని ప్రారంభించే ముందు నిపుణుడిని సంప్రదించాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment