Telangana : జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ భూముల కబ్జాపై సీఎం కీలక నిర్ణయం!

‘జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ’కి కేటాయించిన భూముల కబ్జాపై సీఎం రేవంత్ స్పందించారు. ఈ భూములకు సంబంధించిన అన్ని అంశాలు పరిశీలిస్తానని ఢీల్లీ వేదికగా హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన మాట తప్పనని, రిపోర్ట్ తెప్పించుకుని చర్యలు తీసుకుంటానన్నారు.

New Update
Telangana : తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌.. ఫొటో వైరల్

Jawaharlal Housing Society :జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ’కి కేటాయించిన భూములలో కబ్జా అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తానని తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. జేఎన్‌జే సొసైటీ (JNJ Society) కి భూమి అప్పగింతపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో రిపోర్టు తెప్పించుకుంటానని అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా కొందరు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ సమాధానం ఇచ్చారు.

రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు చేపడతా..
ఈ మేరకు హైదరాబాదులోని పెట్ బషీరాబాద్ లో జర్నలిస్టుల స్థలాలపై పెట్టిన సైన్ బోర్డులను కొందరు భూకబ్జాదారులు అక్రమంగా తీసేసారని విలేకరులు అడిగారు. దీంతో దీనిపైన పరిశీలన చేస్తానని, రిపోర్ట్ కూడా తెప్పించుకొని తగు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల (Congress Party Journalist) పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటామని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చిన హామీ ప్రకారంగా స్థలాలను ఇవ్వాలని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో సొసైటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు.. మందుబాబులకు మంత్రి జూపల్లి శుభవార్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు