/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-31-7.jpg)
CM Revanth: గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమనుంచి ఇంకా ఎలాంటి స్పందనలేదని తెలంగాణ సీఎం రేవంత్ గుర్తు చేశారు. గతంలో తాను ప్రతిపాదించిన గద్దర్ అవార్డులపై ఇప్పటికైనా సినీ ప్రముఖులు స్పందించి ప్రభుత్వ ప్రతిపాదనలు, కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. డా.సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. నంది అవార్డులంత గొప్పగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం డిసెంబర్ 9న నిర్వహిస్తామని చెప్పారు.