TSPSC Group 1: గ్రూప్​-1 వయోపరిమితి పెంపు

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రూప్​-1 వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రూప్​ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

New Update
GROUP-1: గ్రూప్-1 కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు

TSPSC Group 1 Age Limit Increased: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రూప్ - 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రూప్​-1 వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రూప్​ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ALSO READ: టీఎస్‌ ఈ సెట్, లా సెట్ షెడ్యూల్ విడుదల

త్వరలో 15 వేల పోలీసు కొలువులు...

ఇటీవల ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 15 రోజుల్లోనే 15 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు (15000 Constable Posts)  భర్తీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి 15వేల ఉద్యోగాలపై మరోసారి ప్రకటన చేశారు. తాము మాట ఇచ్చాము అంటే ఎన్ని అడ్డంకులు వచ్చిన గట్టిగ నిలబడి ఉంటామని... కచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరుతమనై తేల్చి చెప్పారు. నిరుద్యోగులు ఎవరు అధైర్య పడొద్దని భరోసా నింపారు. అధికారంలో ఉన్నది నిరుద్యోగుల, పేదల ప్రభుత్వం అని అన్నారు.

2 లక్షల ఉద్యోగాలు రాసిపెట్టుకోండి...

అసెంబ్లీ సమావేశంలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం వల్లే యువత ఇంకా నిరుద్యోగులుగా మిగిలి పోయారని మండిపడ్డారు. సమయానికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే తెలంగాణలో ఈనాడు నిరుద్యోగులకు ఈ సమస్య వచ్చేది కాదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పినా విధంగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని.. రాసి పెట్టుకోండని ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు.

ALSO READ: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నావ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం రేవంత్

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు