/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cm-ramesh.jpg)
Andhra University Students : ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్, స్టాఫ్‌ను నాటి వైసీపీ (YCP) సర్కార్ అనేకరకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) విమర్శించారు. AU మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు రమేశ్. అతన్ని వదిలిపెట్టే సమస్య లేదని తేల్చిచెప్పారు. మరోవైపు ఇదే సమయంలో విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున యూనివర్శిటీ వద్దకు వచ్చారు. ప్రసాద్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే విద్యార్థి సంఘం నేతలతో సీఎం రమేశ్ మాట్లాడు. ప్రసాద్ రెడ్డి రాజీనామా (Resign) చేసినా ఆయన్ను వదిలేది లేదని రమేశ్ తెలిపారు.
రమేశ్ ఇంకా ఏం అన్నారంటే?
• ప్రసాద్‌రెడ్డి చేసినవి ప్రతిదీ లెక్క ఉంది... అన్ని లెక్కలు తెలుస్తాం!
• రాజీనామా చేసినంత మాత్రాన వదిలిపెట్టే సమస్య లేదు
• భారతదేశంలో పేరున్న యూనివర్శిటీలో AU ఒకటి ?
• ఇలాంటి విద్యాసంస్థలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టవచ్చా?
• ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకెవరైనా ఉంటే వారిని కూడా వదిలిపెట్టను
• అతన్ని వెంటనే శిక్షించాలని గవర్నర్ ను, అలాగే ప్రభుత్వాన్ని కోరుతున్నా..!
• జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఎలా చెప్తే ప్రసాద్ రెడ్డి అలానే చేశారు....
• దాదాపు 100 కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేశారు....
• వెంటనే అతన్ని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం...
• అతను చేసిన తప్పులు బయటపెడతాం!
Also Read: లడఖ్‌లో ప్రమాదం.. ఐదుగురు ఆర్మీ జవాన్లు మృతి