ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్: కేసీఆర్

50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఖానాపూర్‌ నియోజకర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. 24 గంటలు కరెంట్ కావాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

New Update
ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్: కేసీఆర్

Telangana Elections 2023:తెలంగాణలో రాజకీయ నాయకుల ప్రచారాలతో రాజకీయ రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్‌ నియోజకర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమి లేదని విమర్శించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. ఆలోచించి ఓటు వేయకుండా ఐదేళ్లపాటు నష్టపోతారని అన్నారు. అభ్యర్థులనే కాకుండా వారి వెనక ఉన్న పార్టీలను కూడా చూడలన్నారు. గత పదేళ్లుగా తెలంగాణ పాలనను చూస్తున్నారని.. రాయి ఏదో రత్నమేదో గుర్తించాలని తెలిపారు. దేశంలో రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్‌ఎస్‌ పార్టీ అని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే గిరిజనుల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. 24 గంటలు కరెంట్ కావాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Also Read: కొడంగల్లో హైటెన్షన్.. తన్నుకున్న కాంగ్రెస్, బీఆర్​ఎస్ నేతలు

Advertisment
Advertisment
తాజా కథనాలు