CM Jagan: నేడు ఆ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం ఈరోజు సీఎ జగన్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. విశాఖలో ఇన్ఫోసిస్ నిర్మించిన డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అచ్యుతాపురంలో యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అక్కడ నిర్మించిన ఈ యూనిట్‌ను ప్రారంభించనున్నారు జగన్. By B Aravind 16 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి నేడు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10:20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రుషికొండ వద్ద ఉన్న ఐటీహిల్స్‌లోని నెంబర్ 3కి వెళ్లనున్నారు. అలాగే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిల్ నెంబర్ 2 కి చేరుకొని ఇన్ఫోసిస్ నిర్మించిన డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులతో సీఎం జగన్ సమావేశమవుతారు. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో దీన్ని రూపొందించారు. ఆ తర్వాత హెలిపాడ్ వద్ద ఉన్న జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ మిషన్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15 గంటలకు పరవాడ ఫార్మా సిటీకి చేరుకుంటారు. అక్కడ యూజియా స్టెర్లీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ప్రారంభిస్తారు. ఫార్మా, బయెటెక్ ఉత్పత్తులకు సంబంధించి దాదాపు 300.78 కోట్లతో ఈ పరిశ్రమను నిర్మించారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. Also Read: నేడు హైకోర్టులో చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ ఆ తర్వాత 1:30 PM గంటలకు అచ్యుతాపురానికి చేరుకుంటారు. యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అక్కడ నిర్మించిన ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. అక్కడే ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి లారెస్ ల్యాబ్‌కు చేరుకొని అక్కడ నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. అలాగే లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమకు కూడా ఆయన భూమి పూజ చేయనున్నారు. Also Read: మీకెన్ని..? మాకెన్ని..?.. సీట్ల లెక్క తేల్చనున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ.. #andhra-pradesh #ap-news #ap-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి