BIG BREAKING: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన! ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత విశాఖను రాజధానిగా ప్రకటించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రెండోసారి ముఖ్యమంత్రిగా కొత్త రాజధానిలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. కర్నూల్ ను న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. By srinivas 05 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి AP: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత విశాఖను రాజధానిగా ప్రకటించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రెండోసారి ముఖ్యమంత్రిగా కొత్త రాజధానిలోనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. అలాగే కర్నూల్ ను కూడా న్యాయ రాజధానిగా , అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. కట్టుబడి ఉంటా.. ఈ మేరకు వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పాలన సాగిస్తానని ఆయన తెలిపారు. ఇక్కడే సీఎంగా ప్రమాణం చేస్తానని, ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటానని చెప్పారు. అలాగే విశాఖ అభివద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని మాటిచ్చారు. అంతేకాదు విశాఖ.. హైదరాబాద్ కంటే గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. విశాఖ ఇంకా చాలా అభివద్ధి చెందాల్సి ఉందని తెలిపారు. ఇది కూడా చదవండి: AP : నా కేసుల వివరాలు తెలపండి.. డీజీపీ, సీఐడీ, ఏసీబీలకు చంద్రబాబు లేఖ అభివృద్దిని అడ్డుకుంటున్నారు.. ఇక స్వార్థంతో కూడిన నాయకులు, మీడియా వల్ల విశాఖ వెనుకబడి పోయిందని ఆరోపించారు. కోర్టులకు పోయి విశాఖ అభివృద్ధినే కాదు.. రాష్ట్ర అభివృద్దిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వేల ఎకరాల ప్రైవేటు వ్యక్తులు, బీనాబీల చేతుల్లో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌గా తీసుకెళ్తానని జగన్ హామీ ఇచ్చారు. #cm-jagan #visakhapatnam #declared-capital మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి