చంద్రబాబు అంటే మోసాలు, వెన్నుపోట్లు : సీఎం జగన్! కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. By Bhavana 11 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం (ఆగస్టు 11న) అమలాపురంలో ఏర్పాటయిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కల్గుతుందన్నారు. గత ప్రభుత్వంలో అక్క, చెల్లెమ్మలను మోసం చేశారని.. 14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని అన్నారు. చంద్రబాబు వల్ల అనేక మంది అమాయకులు మోసపోయారని , వారు బాకీ పెట్టిన సొమ్మున్నంతటిని మేము తిరిగి చెల్లించామని అన్నారు. పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని చెప్పారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తారని, అందుకే ఆయనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారంటూ విమర్శించారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు చంద్రబాబు మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్ కు దిగజారాయన్నారు. 2016లో చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు.పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం బడులు పెడితే అడ్డుకోవాలని చూశారని, పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు నరకం చూపించారు చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించారని జగన్ ఆరోపించారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారన్నారు. అధికారం కోసం చంద్రబాబు అర్రులు చాస్తున్నారని, మరోసారి సీఎం కావాలని ఆశపడుతున్నారని అన్నారు. ఆయన సీఎం అయితే ప్రజలకు ఏమాత్రం మంచి జరగదని వ్యాఖ్యానించారు. బాబు శవరాజకీయం అలాగే మొన్నటి పుంగనూరు ఘటన విషయానికొస్తే ఒక రూట్ లో పర్మిషన్ తీసుకొని ఇంకో రూట్ లో వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. 47 మంది పోలీసులకు గాయాలు అయ్యేలా చేశారని.. ఓ పోలీసు అయితే కన్నే పోగొట్టుకున్నారని చెప్పుకున్నారు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడడం లేదని రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారని ఆరోపించారు. మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు బావుండాలని మీరు కోరుకుంటే చంద్రబాబుకు ఓటు వేయొద్దని సూచించారు. #ycp #chandrababu #jagan #konaseema మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి