CM Jagan: బ్రోకర్లను నమ్ముకున్నాడు.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు దళారులను, బ్రోకర్లను నమ్ముకున్నాడని అన్నారు. చంద్రబాబులా నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మద్దతు తనకు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.

New Update
BIG BREAKING : సీఎం జగన్ రాజీనామా

CM Jagan: ఒంగోలు లో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల దాడి చేశారు. ఏపీ కొత్త రాష్ట్రంగా ఏర్పాటు అయినా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన హయాంలో పేదలకు సెంట్‌ స్థలం ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

ALSO READ: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు

1191 కేసులు..

తమ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే చంద్రబాబు 1191 కేసులు వేయించాడని అన్నారు సీఎం జగన్. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయని మండిపడ్డారు. వంద సినిమాల్లో ఉండే విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ అని పేర్కొన్నారు. మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారని ఎద్దేవా చేశారు.

బ్రోకర్లను నమ్ముకున్నాడు..

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారని సెటైర్లు వేశారు సీఎం జగన్. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదని పేర్కొన్నారు. చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదని అన్నారు. నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ మద్దతు తనకు లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. బాబులా దళారులను, బ్రోకర్లను తాను నమ్ముకోలేదని.. తాను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని అని అన్నారు సీఎం జగన్. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి అని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు